టెన్త్, 12వ, తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన సిబిఎస్ఈ

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: సిబిఎస్ఈ పదవతరగతి, 12వ,తరగతి క్లాసుల పరీక్షల షెడ్యూల్‌ను బుదవారం నాడు విడుదల చేసింది.ఈ ఏడాది మార్చిలో పదవతరగతి పరీక్షలు, ఏప్రిల్ లో 12వ, తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నట్టు సిబిఎస్ఈ ప్రకటించింది.

దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్తులు తల్లిదండ్రులు ఈ పరీక్షల తేదీల వివరాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే సిబిఎస్ఈ తన వెబ్‌సైట్‌లో పరీక్ష తేదీల వివరాలను ప్రకటించింది.

CBSE date sheet for Class 10, 12 exams announced

ఈ ఏడాది మార్చి 5వ, తేది నుండి ఏప్రిల్ 4వ, తేది వరకు పదవతరగతి పరీక్షలు నిర్వహించనున్నట్టు సిబిఎస్ఈ ప్రకటించింది. ఏప్రిల్ 12వ, తేది వరకు 12వ, తరగతి పరీక్షలు జరగనున్నాయి.

పదవతరగతి పరీక్షలకు సంబంధించి మార్చి 6న, హిందీ, మార్చి 12న, ఇంగ్లీష్, మార్చి 16న, సైన్స్, మార్చి 22న, సోషల్ సైన్స్, మార్చి 28న, మాథ్స్ పరీక్షలు జరగనున్నాయి.గత ఏడాది సిబిఎస్ఈ పరీక్ష ఫలితాలు ఆలస్యం కావడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Central Board of Secondary Examination (CBSE) has announced the schedule for exams for class 10th and 12th. CBSE date sheet 2018 is available at the official websites cbse.nic.in and cbseacademic.in.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X