Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కరోనా థర్డ్ వేవ్, ఒమిక్రాన్ కేసుల పెరుగుదలతో కేంద్రం కొత్త హోం ఐసోలేషన్ నిబంధనలు

భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణతో పాటుగా విపరీతంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులతో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం బుధవారం కొత్త హోం ఐసోలేషన్ మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశంలో కరోనా మూడవ వేవ్ మరియు ఒమిక్రాన్ కేసుల పెరుగుదల మధ్య కొత్త మార్గదర్శకాలను జారీ చేయాలనే నిర్ణయం తీసుకుంది. లక్షణాలు కనిపించని, స్వల్ప లక్షణాలతో బాధపడే కోవిడ్ బాధితులకు హోం ఐసోలేషన్ మార్గదర్శకాలను తాజాగా సవరించిన కేంద్రం స్వీయ నిర్బంధ కాలాన్ని వారం రోజులకు కుదించింది.

మూడు రోజులు జ్వరం లేకుంటే వారం రోజులు హోం ఐసోలేషన్ చాలు

మూడు రోజులు జ్వరం లేకుంటే వారం రోజులు హోం ఐసోలేషన్ చాలు

లక్షణాలు లేని వారు లేదా స్వల్ప లక్షణాలు ఉన్నవారు కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత వరుసగా మూడు రోజులు జ్వరం లేకపోతే ఏడు రోజుల పాటు హోం ఐసోలేషన్ లో ఉండాలని కేంద్రం పేర్కొంది. హోం ఐసోలేషన్ ముగిసిన తర్వాత మళ్లీ కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.కొత్తగా వెల్లడించిన కరోనా మార్గదర్శకాల ప్రకారం లక్షణాలు లేని స్వల్ప లక్షణాలు కలిగిన కోవిడ్ బాధితులు కుటుంబ సభ్యులకు దూరంగా ఇంట్లో ప్రత్యేక గదిలో ఐసోలేషన్ లో ఉండాలి.

ఐసోలేషన్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఐసోలేషన్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఆ గదిలో గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా చూసుకోవాలి. కుటుంబ సభ్యులు ఐసోలేషన్ లో ఉన్న వ్యక్తి దగ్గరికి రావాల్సి వస్తే ఇద్దరు n95 మాస్క్ ను ఉపయోగించాలి. బాధితులు వీలైనంత ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. ద్రవ పదార్ధాలను అధికంగా తీసుకోవాలి. రోజుకు మూడు సార్లు వేడి నీటితో గార్గిల్ చేసుకోవడం, ఆవిరిపట్టడం వంటివి చేయాలి. జ్వరం తగ్గకపోతే వైద్యులను సంప్రదించి పారాసిటామాల్ టాబ్లెట్స్ తీసుకోవాలి.

హోం ఐసోలేషన్ తర్వాత కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు

హోం ఐసోలేషన్ తర్వాత కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు

శ్వాస స్థాయి లను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. జ్వరం, ఆక్సిజన్ లెవెల్స్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. చేతులను సబ్బు లేదా శానిటైజర్ తో శుభ్రం చేసుకోవడం, బాధితులు ఉంటున్న గదిని శుభ్రంగా ఉంచుకోవడం చేయాలి. తరచూ ముక్కు నోటిని తాకటం వంటివి చేయకూడదు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న బాధితులు వరుసగా మూడు రోజుల పాటు జ్వరం రాకపోతే ఏడు రోజుల తర్వాత హోమ్ ఐసోలేషన్ నుంచి బయటకు రావచ్చు.

ఆ తర్వాత ఎలాంటి కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. బాధితుల అవసరాలను చూసుకునే కుటుంబ సభ్యులు కూడా జాగ్రత్తలు పాటించాలి. బాధితుల గదికి వెళ్లి వచ్చిన తర్వాత చేతులు శానిటైజ్ చేసుకోవాలి.

ఒమిక్రాన్ వ్యాప్తి, కరోనా థర్డ్ వేవ్ నేపధ్యంలో తాజా కొత్త ఐసొలేషన్ మార్గదర్శకాలు ఇచ్చిన కేంద్రం

ఒమిక్రాన్ వ్యాప్తి, కరోనా థర్డ్ వేవ్ నేపధ్యంలో తాజా కొత్త ఐసొలేషన్ మార్గదర్శకాలు ఇచ్చిన కేంద్రం

ఐసోలేషన్ లో ఉన్న సమయంలో కరోనా బాధితులు ఉపయోగించే వస్తువులను ఇతరులతో పంచుకోరాదు. బాధితుల వస్తువులు పట్టుకునేటప్పుడు చేతులకు గ్లౌజులు వేసుకోవాలి. అవసరమైతే టెలీ కన్సల్టేషన్ ద్వారా వైద్యులను సంప్రదించి సలహాలు తీసుకోవాలి. ఎప్పుడూ మూడు లేయర్ల మాస్క్ ను ఉపయోగించాలి.

ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి మాస్క్ ను మార్చుకోవాలి. కనీసం 72 గంటల తరువాత ఉపయోగించిన మాస్క్ లను ముక్కలుగా కత్తిరించి పడేయాలి. ఉపయోగించిన మాస్కులను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు లక్షణ రహితంగా ఉన్న నేపధ్యంలో కేంద్రం తాజా నిబంధనలను సవరించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+