వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉమ్మడి పౌరస్మృతి తయారీ ఇప్పుడే కుదరదన్న కేంద్రం-ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్

|
Google Oneindia TeluguNews

బీజేపీ అజెండాలో ఎప్పటినుంచో ఉన్న ఉమ్మడి పౌరస్మృతి విషయంలో ఇవాళ కేంద్రం సంచలన అడుగు వేసింది. ఉమ్మడి పౌరస్మృతిని దేశంలో అమలు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో దాఖలైన ఓ పిటిషన్ పై తమ స్పందన తెలియజేసిన కేంద్రం.. దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో ఉమ్మడి పౌరస్మృతి విషయంలో బీజేపీ వైఖరిపై ప్రశ్నలు మొదలయ్యాయి.

ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించాలని ఢిల్లీ హైకోర్టులో బీజేపీకి చెందిన లాయర్ అశ్వినీ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కేంద్రం వ్యతిరేకించింది, లా కమిషన్ ఈ అంశాన్ని పరిశీలిస్తోందని, నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం సమస్యను పరిశీలిస్తుందని పేర్కొంది. అయితే, వివిధ మత వర్గాలకు చెందిన పౌరులు వేర్వేరు ఆస్తి, వివాహ చట్టాలను అనుసరిస్తున్నారని, ఇది దేశం యొక్క ఐక్యతకు అవమానకరం అని పేర్కొంది.

central government opposed plea for framing uniform civil code in delhi high court

కామన్ సివిల్ కోడ్ పై దాఖలైన పిటిషన్ కు సమాధానమిస్తూ భారత్ లో పార్లమెంటు తనకున్న సార్వభౌమాధికారంతో చట్టాలు చేస్తుందని, ఇందులో బయటి వ్యక్తుల ప్రభావం, నిర్ణయాల ఆధారంగా ఏదీ జరగదని హైకోర్టుకు తెలిపింది.అలాగే ఒక నిర్దిష్ట చట్టాన్ని రూపొందించడానికి పార్లెమంట్ కు మాండమస్ రిట్ జారీ చేసే అవకాశం ఉండదని కూడా వెల్లడించింది. ఇది ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు నిర్ణయించవలసిన విధానపరమైన అంశమని, ఈ విషయంలో కోర్టు ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని పేర్కొంది.

మరోవైపు ఈ పిటిషన్ లో లాయర్ అశ్వినీ ఉపాధ్యాయ్ కేంద్రం.. ఉమ్మడి పౌరస్మృతిని తయారు చేసేందుకు వీలుగా జ్యుడిషియల్ కమిషన్ లేదా అత్యున్నతస్ధాయి కమిటీని ఏర్పాటు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని హైకోర్టును కోరారు. అలాగే ఆర్టికల్ 44 ప్రకారం.. కేంద్రం ఆదేశ సూత్రాలను అమలు చేయాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేశారు. అయితే కేంద్రం మాత్రం ప్రస్తుతం లా కమిషన్ అధ్యయనం చేస్తున్న కామన్ సివిల్ కోడ్ పై నివేదిక వచ్చాకే ఎలాంటి చర్యలైనా తీసుకుంటామని తెలిపింది. అంతవరకూ వేచి చూడాలని కోరింది.

English summary
The union government on today opposed a petition in delhi high court seeking framing of uniform civil code in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X