• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అక్కడికి వెళ్లే వీల్లేదు: ఉప ఎన్నికల వేళ..మమత బెనర్జీకి కేంద్రం నుంచి నో పర్మిషన్

|

కోల్‌కత: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఉప ఎన్నికల వేళ.. కేంద్రం తీసుకున్న ఈ చర్య రాజకీయంగా కలకలం పుట్టిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం తమపై కక్షపూరకంగా వ్యవహరిస్తోందంటూ తృణమూల్ కాంగ్రెస్ మండిపడుతోంది. ఒక ముఖ్యమంత్రిగా మమత బెనర్జీకి అందిన ఆహ్వానాన్ని తిరస్కరించడంపై ఆ పార్టీ నాయకులు భగ్గుమంటున్నారు.

ప్రపంచ శాంతి సదస్సుకు..

ప్రపంచ శాంతి సదస్సుకు..

మమత బెనర్జీ- ప్రపంచ శాంతి సదస్సుకు హాజరు కావాల్సి ఉంది. వచ్చేనెల ఇటలీలో ఈ సదస్సు ఆరంభమౌతుంది. ఇందులో పాల్గొనాల్సిందిగా నిర్వాహకులు ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన కొందరు ప్రముఖులకు ఇదివరకే ఆహ్వానాలను పంపించారు. ఈ ఆహ్వాన పత్రాలను అందుకున్న వారిలో మమత బెనర్జీ కూడా ఉన్నారు. రోమ్ వేదికగా వచ్చేనెల 6,7 తేదీల్లో జరిగే ఈ ప్రపంచ శాంతి సదససుకు పోప్ ఫ్రాన్సిస్, జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఈజిప్ట్ అల్ అజర్ గ్రాండ్ ఇమామ్ అహ్మద్ అల్-తయ్యిబ్, ఇటలీ ప్రధానమంత్రి మారియో ద్రఘి సహా పలువురు ప్రముఖులు, వివిధ దేశాధినేతలు హాజరు కానున్నారు.

 శక్తిమంతమైన మహిళగా..

శక్తిమంతమైన మహిళగా..


ప్రపంచవ్యాప్తంగా శక్తిమంతమైన మహిళలుగా గుర్తించిన వారిని ఈ శాంతి సదస్సుకు ఆహ్వానించారు నిర్వాహకులు. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన భారతీయ జనతా పార్టీని ఓడించి.. ముఖ్యమంత్రిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన మమత బెనర్జీని కూడా శక్తిమంతమైన మహిళగా గుర్తించారు. ఈ సదస్సుకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆహ్వాన పత్రాలను పంపించారు. వచ్చేెనెల 6వ తేదీన ఆమె రోమ్‌కు బయలుదేరి వెళ్లాల్సి ఉంది.

 నో పర్మిషన్..

నో పర్మిషన్..


ఈ పరిస్థితుల్లో- మమత బెనర్జీకి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ ప్రపంచ శాంతి సదస్సులో పాల్గొనడానికి అనుమతి ఇవ్వడానికి నిరాకరించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి ఆమెకు సూచనలు వెళ్లాయి. తన ఇటలీ పర్యటనను రద్దు చేసుకోవాల్సిందిగా ఆ శాఖ అధికారులు ఆమెకు విజ్ఞప్తి చేశారు. దీనిపట్ల తృణమూల్ కాంగ్రెస్ నాయకులు అసహనాన్ని వ్యక్తం చేస్తోన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శిస్తోన్నారు.

చైనాకు కూడా వద్దన్నారే..

చైనాకు కూడా వద్దన్నారే..


ఇదివరకు మమత బెనర్జీ నిర్వహించ తలపెట్టిన చైనా పర్యటనకు కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని, ఇప్పుడు ఇటలీ వెళ్లడానికీ ఎందుకు నిరాకరిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ప్రపంచ దేశాలతో సన్నిహిత సంబంధాలను ఆశించే తాము రోమ్‌లో నిర్వహించ తలపెట్టిన శాంతి సదస్సుకు హాజరవుతున్నామే తప్ప మతాల మధ్య చిచ్చు పెట్టడానికి కాదని చెబుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటలీని సందర్శించలేదా? అని తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి దేబాంగ్షు భట్టాచర్య దేవ్ ప్రశ్నించారు.

 విదేశాంగ శాఖ వివరణ ఏంటీ?

విదేశాంగ శాఖ వివరణ ఏంటీ?


మమత బెనర్జీ ఇటలీ పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తోన్న సంజాయిషీ మరోలా ఉంది. ఇటలీకి ఎలాంటి అధికారిక బృందాలను తీసుకుని రాకూడదంటూ ప్రపంచ శాంతి సదస్సు నిర్వాహకులు విజ్ఞప్తి చేయగా.. మమత బెనర్జీ దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు అంటున్నారు. కొందరు పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు, పెట్టుబడుల మంత్రిత్వ శాఖ అధికారులతో కూడిన టీమ్‌ను తీసుకెళ్లాలని మమత బెనర్జీ ప్రతిపాదించారని, అందుకే- అనుమతులను ఇవ్వలేదని చెబుతున్నారు. ఇది కాస్త రాజకీయ వేడిని రగిల్చినట్టయింది ఈ రెండు పార్టీల మధ్య.

English summary
The Union Ministry of External Affairs has denied West Bengal Chief Minister Mamata Banerjee permission to participate in the World Peace Conference to be held in Italy in October this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X