ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర మంత్రి - కేంద్రం వివాదాస్పద బిల్లు..!!

కేంద్రం మరో వివాదాస్పద బిల్లును ప్రతిపాదించింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్..ఎన్నికల కమిషనర్ నియామకాల ఎంపిక కమిటీల్లో భారత ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర మంత్రిని తీసుకొనేందు కు ప్రతిపాదిస్తూ రాజ్యసభలో బిల్లును ప్రవేశ పెట్టింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులను నీరుగార్చేలా ప్రభుత్వ చర్య ఉందని విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఎన్నికల సంఘం నియామకాల్లో ప్రభుత్వ నియంత్రణ పెంచి..ఈసీని తోలు బొమ్మలా చేసేందుకే ఈ బిల్లును తెచ్చారని విమర్శిస్తున్నాయి.

కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లును వ్యతిరేకించాలని విపక్షాలు పిలుపునిచ్చాయి. ఎన్నికల కమిషనర్ల నియామకాలపై పార్లమెంట్ లో ఒక చట్టం చేసేంత వరకు, ప్రధాని..లోక్ సభలో విపక్ష నేత..సీజేఐ కలిసి ఈ నియామకాలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఈ ఏడాది మార్చిలో తీర్పు ఇచ్చింది. అంతకు ముందు వరకు ఈ నియామకాలను కేంద్ర సర్కారు సిఫార్సు మేరకు రాష్ట్రపతి చేసేవారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్ వాల్ ప్రవేశ పెట్టిన ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామక షరుతలు, పదవీ విరమణ కాలం బిల్లు - 2023 ప్రకారం కమిటీకి ప్రధాని నేతృత్వంలో త్రిసభ్య సంఘం ఏర్పాటవుతుంది.

Central moved a bill seeks the removal of the CJI from the selection committee for the CEC and ECs

దీని లో లోక్ సభ విపక్ష నేత, ప్రధాని నియమించే ఒక కేబినెట్ మంత్రి సభ్యులు ఉంటారు.ఒక వేళ లోక్ సభలో విపక్ష నేత ఎవరూ లేకపపోతే ఏకైక అతిపెద్ది విపక్ష పార్టీ నేతను ఆ స్థానంలో తీసుకుంటారు. కేంద్ర కార్యదర్శి స్థాయిలో ఉంటూ ఎన్నికల నిర్వహణ పైన అవగాహన, అనుభవం ఉన్నవారికి నియామకాలకు పరిగణలోకి తీసుకుంటారు. కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలో మరో ఇద్దరు సభ్యులతో కూడిన సెర్చ్ కమిటీ..అయిదుగురు వ్యక్తులతో ప్యానల్ ను రూపొందించి ఎంపిక కమిటీకి పంపిస్తుంది.

ప్రస్తుత చట్టంలో ఇలాంటివి లేవని తెలుస్తోంది. ఆరుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పునే నీరుగార్చి, కాలరాసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. ఈ బిల్లు రాజ్యాంగా విరుద్దంగా ఉందని, పార్లమెంట్ ఆమోదించినా సుప్రీంకోర్టు కొట్టవేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ బిల్లు పైన కాంగ్రెస్, ఆప్ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ రిగ్గింగ్ కు ప్రయత్నిస్తోందని, అందుకే కొత్త బిల్లు తెచ్చిందని టీఎంసీ తీవ్ర ఆరోపణలు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+