జనాభా రిజిస్టర్ లో వివాదాస్పద ప్రశ్నలు-రాష్ట్రాల అభ్యంతరాల బేఖాతర్-కొనసాగించిన కేంద్రం
జాతీయ జనాభా రిజిస్టర్ లో వివరాల నమోదు కోసం కేంద్రం రూపొందించిన ప్రశ్నావళిపై గతంలోనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రజల మాతృభాష, తల్లితండ్రుల జన్మస్ధలం వంటి ప్రశ్నల్ని ఇందులో ఉంచడంపై రాష్ట్రాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. అయినా కేంద్రం వీటిని పట్టించుకోలేదు. ఈ ప్రశ్నల్ని యథాతథంగా కొనసాగిస్తూ జనాభా లెక్కలు గణించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జనాభా లెక్కల అధికారులకు ఈ ప్రశ్నావళినే పంపింది.
వాస్తవానికి తొలిసారిగా జాతీయ జనాభా రిజిస్టర్ 2010లోనే తయారైంది. దీన్ని 2015లో అప్ డేట్ చేశారు. 2019లో మరోసారి 30 లక్షల మందితో పైలట్ ప్రాజెక్టుగా పెట్టి దీని నమోదు ప్రశ్నావళిలో మరిన్ని ప్రశ్నలు చేర్చారు. 2003లో అమల్లోకి తెచ్చిన జాతీయ పౌరసత్వ నిబంధనల భాగంగా తీసుకొచ్చిన జాతీయ పౌర పట్టిక కోసమే ఈ కార్యక్రమం చేపడుతున్నారని పలు రాష్ట్రాలు, సంస్ధలు, ప్రజలు అభ్యంతరాలు తెలిపారు. అయినా కేంద్రం వాటిని పట్టించుకోనట్లే కనిపిస్తోంది.

ఈసారి జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా కేంద్రం.. ఈ జనాభా రిజిస్టర్ ద్వారా సేకరించిన వివరాల్ని కూడా అప్ డేట్ చేయబోతోంది. దీంతో ఈ వ్యవహారం వివాదాస్పదమవుతోంది. ఈ జనాభా రిజిస్టర్ ప్రశ్నావళిలో ప్రతీ కుటుంబానికి చెందిన 14 వివరాలను ప్రశ్నల రూపంలో రాబట్టనున్నారు. ఇందులో తల్లితండ్రులు పుట్టిన స్ధలాలు, ఈ దేశం కాకపోతే విదేశాల వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. పాస్ పోర్ట్ నంబరు, కుటుంబ పెద్దతో ఉన్న సంబంధం, విడాకులు తీసుకుంటే ఆ వివరాలు, మాతృభాష, ఆధార్, ఓటరు కార్డు నంబర్లు, డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ పైనా ప్రశ్నలు ఉన్నాయి.
జాతీయ జనాభా రిజిస్టర్ లో నమోదు కావడం ప్రతీ ఒక్కరికీ తప్పనిసరని ప్రభుత్వం చెబుతోంది. అలాగే ప్రతీ పౌరుడి యొక్క పూర్తి వివరాలు, సమగ్ర సమాచారం జాతీయ జనాభా రిజిస్టర్ లో నమోదు చేస్తామని వెల్లడించింది. ఇందులో నమోదు చేసిన వివరాలు జాతీయ జనాభా చట్టం ప్రకారం రహస్యంగీనే ఉంటుందని, కేవలం జనాభా వివరాలు మాత్రమే తాము వెల్లడిస్తామని కేంద్రం చెబుతోంది. అయినా ప్రజల్లో, రాష్ట్రాల్లో ఉన్న అభ్యంతరాలు మాత్రం తొలగిపోలేదు.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్ -
జైపూర్ ఏనుగుకు గులాబీ రంగు పూసిన రష్యన్.. జైలుకు వెళ్లక తప్పదా ??? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications