కేంద్రం మరో సంచలనం-ఐపీసీ, సీఆర్పీసీ సహా 3 చట్టాల రద్దు-వాటి స్ధానంలో కొత్త బిల్లులు..

బ్రిటీష్ కాలం నాటి చట్టాల అమలుపై దేశంలో అభ్యంతరాలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఇవాళ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్లమెంటులో ప్రస్తుతం అమల్లో ఉన్న మూడు క్రిమినల్ చట్టాల్ని వెనక్కి తీసుకుంటూ బిల్లుల్ని ప్రవేశపెట్టింది. అంతే కాదు వాటి స్ధానంలో మరో మూడు కొత్త చట్టాల్ని తీసుకొస్తామని వెల్లడించింది. ఇవి అమల్లోకి వస్తే ప్రస్తుతం అమల్లో ఉన్న ఐపీసీ, సీఆర్పీసీతో పాటు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కూడా రద్దవుతాయి.

దేశంలోని క్రిమినల్ చట్టాలను సమూలంగా మార్చేందుకు వీలుగా కేంద్రం తెచ్చిన మూడు బిల్లుల్ని హోంమంత్రి అమిత్ షా ఇవాళ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లను రద్దు చేసి వాటి స్థానంలో ఈ బిల్లుల్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. వివాదాస్పద దేశద్రోహ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయడం కూడా ఈ బిల్లుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మూకుమ్మడి దాడుల కేసుల్లో మరణశిక్షలు కూడా విధించనున్నారు.

centre introduced three new bills to overhaul existing criminal laws

జాతి, కులం, సంఘం, లింగం, పుట్టిన ప్రదేశం, భాష, వ్యక్తిగత విశ్వాసం, మరేదైనా కారణంతో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల సమూహం హత్యకు పాల్పడినప్పుడు అటువంటి సమూహంలోని ప్రతి సభ్యునికి మరణశిక్ష విధించేలా ఈ కొత్త బిల్లులు అవకాశం కల్పించబోతున్నాయి. యావజ్జీవ కారాగార శిక్ష లేదా ఏడేళ్ల కంటే తక్కువ కాకుండా జైలు శిక్ష, , జరిమానా కూడా విధించేలా ఐపీసీ స్ధానంలో రాబోతున్న కొత్త బిల్లు భారతీయ న్యాయ సంహిత పేర్కొంది.

ఎన్నికల సమయంలో ఓటర్లకు లంచం ఇస్తే ఏడాది జైలు శిక్ష పడే నిబంధన కూడా ఇందులో ఉంది. ఇతర ప్రతిపాదిత శిక్షల్లో సామూహిక అత్యాచారానికి 20 సంవత్సరాల జైలు నుండి జీవిత ఖైదు, మైనర్‌పై అత్యాచారానికి మరణశిక్ష కూడా ఉన్నాయి. కొత్తగా రాబోయే చట్టాల్లో నేర పరిశోధన, చలాన్ల విధింపు ప్రక్రియ వీడియో గ్రాఫ్ చేస్తారు. ఎక్కడి నుండైనా ఇ-ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం కల్పిస్తారు. పరారీలో ఉన్నవారిని కూడా విచారించే అవకాశం కల్పిస్తారు. ఇలాంటి కేసుల్లో 90 రోజుల్లో ఎఫ్ఐఆర్ అప్ డేట్ చేయడం తప్పనిసరి. ఈ మూడు బిల్లులను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపుతామని అమిత్ షా తెలిపారు.

కోర్టులకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారని, కోర్టులకు వెళ్లడమే శిక్షగా భావిస్తున్నారని అమిత్ షా అన్నారు.భారతీయ న్యాయసంహితతో పాటు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌ (సీఆర్పీసీ) స్ధానంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్యం చట్టం స్థానంలో భారతీయ సాక్ష్య బిల్లును కూడా ప్రవేశపెట్టబట్టారు. 7 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష విధించే సెక్షన్లన్నింటి కింద కేసుల ఫోరెన్సిక్ బృందం నేరస్థలానికి వెళ్లడం తప్పనిసరి చేస్తామని అమిత్ షా చెప్పారు.
వివాదాస్పద దేశద్రోహ చట్టం రద్దు చేశామని, సెక్షన్ 150 దీని స్ధానంలో అమలవుతుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+