వాహనాల హారన్ల స్ధానంలో తబలా, ఫ్లూట్, వయోలిన్ మ్యూజిక్-కేంద్రం తాజా ప్లాన్ ..!

దేశవ్యాప్తంగా ఆటోమొబైల్ రంగం వ్యాప్తి చేస్తున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్రం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంది. అయినా ఇంకా వాయుకాలుష్యం, శబ్దకాలుష్యం అదుపులోకి రావడం లేదు. ఇప్పటికే వాయు కాలుష్య నివారణకు పర్యావరణహితమైన వాహనాలను అందుబాటులోకి తెస్తున్న కేంద్రం.. శబ్ద కాలుష్యాన్ని అరికట్టేందుకు మరో కొత్త ఐడియాను సిద్దం చేస్తోంది. ఇది అమల్లోకి వస్తే రోడ్లపై వాహనాల హారన్ల శబ్దాల నుంచి జనానికి ఊరట దక్కే అవకాశముంది.

ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా వాహనాల హారన్ల శబ్దాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. నగరాల్లో, పట్టణాల్లో, చివరికి పల్లెల్లోనూ పెరుగుతున్న వాహనాలతో పాటు వాటి నుంచి వచ్చే శబ్దాల తీవ్రత కూడా పెరిగిపోతోంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు రెగ్యురల్ హారన్ల స్ధానంలో తబలా, ఫ్లూట్, వయోలిన్, హార్మోనియం సంగీతాన్ని హారన్ గా మార్చేందుకు కేంద్రం ప్రతిపాదనలు చేస్తోంది. ఒకసారి వాహనాలకు ఈ సంగీతం హారన్ రూపంలో అమల్లోకి వస్తే పరిస్ధితి పూర్తిగా మారిపోయే అవకాశముంది.

centre plans to replace horn sounds with flute tabla violin and harmonium music for vehicles

భారతీయ సంగీత వాయిద్యాల శబ్దాలను వాహన హారన్‌లుగా ఉపయోగించడాన్ని తప్పనిసరి చేస్తూ ఒక చట్టాన్ని ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా ప్రకటించారు. ఫ్లూట్, తబలా, వయోలిన్, హార్మోనియం వంటి శబ్దాలను ఉపయోగించడం ద్వారా వాహన హారన్‌లను మరింత ఆహ్లాదకరంగా మార్చడమే తమ లక్ష్యమని తెలిపారు.

centre plans to replace horn sounds with flute tabla violin and harmonium music for vehicles

దేశంలోని వాయు కాలుష్యంలో 40 శాతం రవాణా రంగం నుంచే వస్తుందని గడ్కరీ అంగీకరించారు. దీనిని ఎదుర్కోవడానికి, మోడీ ప్రభుత్వం వాహనాలకు ఆకుపచ్చ, మిథనాల్, ఇథనాల్ వంటి జీవ ఇంధనాలను ఉపయోగించడాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. ద్విచక్ర వాహనాలు, కార్ల ఎగుమతి ద్వారా దేశం గణనీయమైన ఆదాయాన్ని సంపాదిస్తుందని, 2014లో రూ.14 లక్షల కోట్ల విలువైన ఈ పరిశ్రమ ఇప్పుడు రూ.22 లక్షల కోట్లకు పెరిగిందని గుర్తుచేశారు. అలాగే భారత్ జపాన్‌ను అధిగమించి ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా అవతరించిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+