Manipur : కేంద్రం కీలక నిర్ణయం-మణిపూర్ డీజీపీ అవుట్...
ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో సాధారణ పరిస్దితుల్ని నెలకొల్పేందుకు కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే మణిపూర్ ఘర్షణలపై విచారణ కోసం జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసిన కేంద్రం, సంక్షోభ నివారణకు శాంతి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. దీనికి కొనసాగింపుగా ఇవాళ డీజీపీని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. త్రిపుర క్యాడర్ కు చెందిన మరో సీనియర్ ఐపీఎస్ ను డీజీపీగా నియమించింది.
మణిపూర్‌లో చోటు చేసుకున్న ఘర్షణల్లో ఇప్పటి వరకు కనీసం 80 మంది ప్రాణాలను కోల్పోయారు. వీటిని అరికట్టడంలో విఫలమైన ప్రస్తుత డీజీపీ డౌంగెల్ ను హోంశాఖకు బదిలీ చేసిన కేంద్రం.. ఆయన స్ధానంలో త్రిపుర క్యాడర్ ఐపీఎస్ రాజీవ్ సింగ్ ను నియమించింది. గతంలో సీఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా ఉన్న రాజీవ్ సింగ్.. మే 29న కేంద్రం నుండి మణిపూర్‌కు ఇంటర్-కేడర్ డిప్యుటేషన్‌పై వచ్చారు.

స్ధానికంగా నెలకొన్న కులాల ఘర్షణలను నివారించే క్రమంలో గిరిజనేతర, మైతేయేతర పోలీసు బాస్ ను కేంద్రం వ్యూహాత్మకంగా నియమించినట్లు తెలుస్తోంది. మే 3న రాష్ట్రంలో హింస చెలరేగిన వెంటనే కేంద్ర ప్రభుత్వం సీఆర్పీఎఫ్ మాజీ చీఫ్ కుల్దీప్ సింగ్‌ను మణిపూర్ ప్రభుత్వానికి భద్రతా సలహాదారుగా నియమించింది. అలాగే ఘర్షణలపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది. సంక్షోభాన్ని పరిష్కరించడానికి శాంతి కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.
మణిపూర్ లో హింసను అరికట్టేందుకు చర్చలే మార్గమని అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో విశ్రాంత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో న్యాయ విచారణ త్వరలో ప్రారంభం కానుందని తెలిపారు. శాంతి కమిటీ మణిపూర్ గవర్నర్ అనుసూయా ఉయికే ఆధ్వర్యంలో ఉంటుందని చెప్పారు. ఇందులో అన్ని రాజకీయ పార్టీలు, కుకీ, మెయిటీ కులాలుస అలాగే సామాజిక సంస్థల ప్రతినిధులు ఉంటారు.












Click it and Unblock the Notifications