వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూక హత్యలపై కేంద్రం ప్రత్యేక కమిటీ: 4వారాల్లో నివేదిక

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెరుగుతున్న మూక దాడులు, హత్యలను నిరోధించేందుకు అవసరమైన సూచనలు అందించేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో నలుగురు సభ్యులతో కేం‍ద్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక కమిటీని నియమించింది.

హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌ గుబ అధ్యక్షతన పనిచేసే ఈ కమిటీ నాలుగు వారాల్లోగా తన నివేదికను సమర్పిస్తుంది. మూక హత్యలను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టంతో ముందుకు రావాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

Centre sets up panel to suggest measures to deal with mob lynching

శాంతిభద్రతలను మూకలు తమ చేతుల్లోకి తీసుకోవడాన్ని అనుమతించరాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. మరోవైపు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన మూక హత్యలపై మంత్రుల బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ బృందం ప్రధాని నరేంద్ర మోడీకి తమ సిఫార్సులను సమర్పించనుంది.

దాడులు, మూక హత్యలపై సుప్రీం కోర్టు ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను గౌరవిస్తామని, రాష్ట్రాలకూ ఈ తరహా దాడులను నిరోధించేలా మార్గదర్శకాలు జారీ చేశామని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది.

English summary
The government on Monday set up a high-level panel headed by headed by Union home secretary Rajiv Gauba to formulate appropriate measures to deal with mob lynching incidents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X