ఇకపై ఆ ఫాస్టాగ్‌లు బ్లాక్ లిస్ట్‌లోకి.. కేంద్రం సంచలన నిర్ణయం
ప్రయాణికులకు, వాహన దారుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక కొత్త పథకాలు, సంస్కరణలు తీసుకొచ్చింది. టోల్ ప్లాజాల వద్ద కూడా ఎలాంటి రద్దీ లేకుండా డిజిటల్ వ్యవస్థ, యానవల్ పాసులు ప్రారంభించింది. అయితే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. లూజ్ ఫాస్టాగ్ లపై ఉక్కుపాదం మోపింది. విండో షీల్డ్ లపై అతికించకుండా టోల్ గేట్ల వద్ద వ్యక్తిగతంగా చూపించే ఫాస్టాగ్ లకు బిగ్ షాక్ ఇచ్చింది.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) కీలక నిర్ణయం తీసుకుంది. విండో షీల్డ్ లపై అతికించకుండా టోల్ గేట్ల వద్ద వ్యక్తిగతంగా చూపించే ఫాస్టాగ్ లను బ్లాక్ లిస్ట్ లోకి పెట్టనున్నట్లు పేర్కొంది. లూజ్ ఫాస్టాగ్స్ వల్ల టోల్ ప్లాజాల వద్ద ఆలస్యం కావడం, టోలింగ్ వ్యవస్థ దుర్వినియోగం, రద్దీ పెరగడం, ఇతరులకు అనవసర జాప్యాలు కలిగిస్తున్నట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా గుర్తించింది. ఈ మేరకు వీటిని బ్లాక్ లిస్టులోకి మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
సాధారణంగా అయితే ప్రతి వాహనదారుడు తమ ఫాస్టాగ్ ను వాహన విండో షీల్డ్ పై శాశ్వతంగా అతికించాల్సిందే. కానీ కొందరు డ్రైవర్లు ఫాస్టాగ్ ను వాహనంపై ఫిక్స్ చేయకుండా టోల్ గేట్ల వద్ద వ్యక్తిగతంగా చూపిస్తున్నారు. దీంతో అక్కడ రద్దీ ఏర్పడి.. రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయంగా మారుతోందని కేంద్రం ప్రభుత్వం గ్రహించింది. ఈ నేపథ్యంలో, ఇలాంటి ట్యాగ్-ఇన్-హ్యాండ్ తరహా లూజ్ ఫాస్టాగ్ ల వాడకాన్ని కట్టడి చేయాలని NHAI స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు ఇటీవల కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. హైవేలపై రాకపోకలు సాగించే వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా హైవే ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు కేవలం రూ. 3వేలతో ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచే వార్షిక పాస్‌ల జారీ ప్రక్రియ మొదలవుతుందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ప్రకటించారు.












Click it and Unblock the Notifications