భారీగా కోవిడ్ కేసులు-కేంద్రం హెచ్చరికలు- ఏప్రిల్ 10, 11న ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్..
దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1590 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇవ గత 146 రోజుల్లో గరిష్టంగా అంచనా వేశారు. ఓమిక్రాన్ ఉపరకం వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఎప్పటికప్పుడు పరిస్ధితుల్ని గమనిస్తూ రాష్ట్రాల్ని అప్రమత్తం చేస్తోంది.
గత 24 గంటల్లో బయటపడిన 1590 కేసులతో కలిపి ప్రస్తుతం దేశంలో యాక్టివ్ గా ఉన్న కేసుల సంఖ్య 8601కు పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్రం మరింత అప్రమత్తమైంది. సోమవారం రాష్ట్రాలతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో రాష్ట్రాల్ని మరింత అప్రమత్తం చేయబోతున్నారు. ముఖ్యంగా గతంలో కోవిడ్ వేవ్ ల సమయంలో పాయించిన ప్రోటోకాల్ ను తిరిగి అమలు చేయాలని కోరే అవకాశం కూడా ఉంది.

మరోవైపు దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్విత్వశాఖ ఏప్రిల్ 10, 11 తేదీల్లో ఐసీఎంఆర్ తో కలిసి ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్ నిర్వహంచాలని నిర్ణయించింది. కోవిడ్ కేసులు భారీగా వస్తే ఏమాత్రం సన్నద్ధంగా ఉన్నారో తెలుసుకునేందుకు ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించబోతున్నారు. కోవిడ్ వేవ్ తగ్గుముఖం పట్టాక ఆస్పత్రుల్లో ఆ మేరకు అప్రమత్తత కూడా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ మాక్ డ్రిల్ ద్వారా ఆస్పత్రుల్ని అప్రమత్తం చేయబోతోంది.












Click it and Unblock the Notifications