వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యవసాయ చట్టాలను కేంద్రం తిరిగి తీసుకురాదు: కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్

|
Google Oneindia TeluguNews

ఇండోర్: ఇటీవల కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకొస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర వ్వవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తాజాగా స్పష్టతనిచ్చారు. కేంద్ర ప్రభుత్వం మళ్లీ వ్యవసాయ చట్టాలను తీసుకురాదని తోమర్ వ్యాఖ్యానించారు.

మూడు వ్యవసాయ చట్టాలను కొందరు నల్ల చట్టాలుగా అభివర్ణించి వివాదాలు సృష్టించారు. అందువల్లే రద్దు చేశాం. అయితే, తాము ఒక్క అడుగు వెనక్కి వేశామంటే.. మళ్లీ ముందడుగు వేస్తామని నరేంద్ర సింగ్ తోమర్ శనివారం వ్యాఖ్యానించారు. దీంతో కేంద్రం మళ్లీ వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. విపక్షాలు కూడా కేంద్రమంత్రి వ్యాఖ్యలపై మండిపడ్డాయి.

Centre Will Not Bring Back Farm Laws: Agriculture Minister Tomar Clarifies on his comments

పలు రాష్ట్రాల్లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ ప్రభుత్వం.. తిరిగి వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చే కుట్ర చేస్తోందని కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై స్పష్టతనిచ్చారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. తను వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకొస్తామని చెప్పలేదని, కేంద్రం ఆ చట్టాలను తిరిగి తీసుకువచ్చే ప్రసక్తే లేదన్నారు.

మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకొస్తామని తాను చెప్పలేదన్నారు. కేంద్రం మంచి చట్టాలను రూపొందించింది. కానీ, కొన్ని కారణాల వల్ల రద్దు చేయాల్సి వచ్చింది. అయితే, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మాత్రమే చెప్పాను అని కేంద్రమంత్రి తోమర్ స్పష్టం చేశారు.

English summary
Centre Will Not Bring Back Farm Laws: Agriculture Minister Tomar Clarifies on his comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X