ఈ ర్యాపిడో రైడర్ ను ఎంత పొగిడినా తక్కువే..!
ప్రస్తుతం ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది ఉద్యోగులు, విద్యార్థులు.. ప్రైవేట్ ట్రావెల్ సంస్థలపై ఆధారపడుతున్నారు. ర్యాపిడో, ఓలా, ఉబర్ లు 24 గంటలు పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి. ఏ సమయంలోనైనా వేగంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి. అయితే ర్యాపిడో, ఉబర్, ఓలా రైడర్లు.. ఓ వైపు అలుపెరగకుండా రైడ్స్ చేస్తూనే.. మరోవైపు బుక్ చేసుకున్న కస్టమర్లపై అమితమైన ప్రేమ, గౌరవం చూపిస్తున్నారు.
ఇందుకు సంబంధించిన చాలా ఘటనలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇటీవల బెంగళూరులో ఆకలితో ఉన్న మహిళా ప్రయాణికురాలి ఆకలి తీర్చి అందరి ప్రశంసలు పొందాడు ఓ ఉబర్ క్యాబ్ డ్రైవర్. ఆమె ఆకలితో ఉన్నట్లు తన ఫ్రెండ్ తో ఫోన్ లో చెబుతుండగా విని కారు రోడ్డు పక్కన ఆపేసి వెళ్లి ఓ షాపులో శాండ్ విచ్ కొని ఆమెకు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఇన్ స్టా పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
అయితే తాజాగా బెంగళూరులో మరోసారి ఇలాంటి ఘటనే రిపీట్ అయింది. ఓ మహిళ.. అర్ధరాత్రి ర్యాపిడో బుక్ చేసుకుంది. త్వరగా ఇంటికి వెళ్లాలని కొంచెం స్పీడుగా వెళ్లమని కోరింది. అయితే జర్నీ మధ్యలో బైకు చెయిన్ తెగిపోయింది. అయితే రైడర్ మాత్రం అర్ధరాత్రి ఆమెను అలా వదిలేయకుండా.. రైడ్ క్యాన్సిల్ అని చెప్పకుండా.. ఎంతో ఓపికతో ఆ చెయిన్ సరిచేశాడు. ఆ తర్వాత ఆ ప్రయాణికురాలిని సురక్షితంగా గమ్య స్థానానికి చేర్చాడు.. ఈ ఘటనపై ఆమె పూర్తి వివరాలను ఇన్ స్టా లో పోస్టు చేసింది. అది కాస్తా వైరల్ గా మారింది.
యువతి ఇన్ స్టాలో పెట్టిన పోస్టు ప్రకారం.. బెంగళూరుకు చెందిన ఆషా మానే అనే యువతి రాత్రి 11 గంటల 45 నిమిషాల సమయంలో ర్యాపిడో బుక్ చేసుకుంది. ఆ సమయంలో యువతి మొబైల్ లో 6 శాతం మాత్రమే ఛార్జింగ్ ఉంది. అయితే మార్గమధ్యలో రైడర్ బైక్ చెయిన్ తెగిపోయింది. ఇంకా 38 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంది. అయితే ఆ రైడర్.. రైడ్ క్యాన్సిల్ చేయమని అడగలేదు. ఓపికతో 10 నిమిషాల్లో ఆ చెయిన్ రీ పేర్ చేశాడు. అలా అర్ధరాత్రి 1 గంటకు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నానని ఆ యువతి పేర్కొంది. ఈ మేరకు ఇలా మహిళలను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చే రైడర్లను అభినందించాలని స్పష్టం చేసింది.

ఈ ఘటనపై ర్యాపిడో అధికారిక వెబ్ సైట్ పోస్టు చేసింది. ఈ పోస్టు హృదయాన్ని కదిలించేలా ఉందని పేర్కొంది. అలాగే ర్యాపిడో రైడర్ కృషికి, నిజాయితీకి తగిన గుర్తింపును కూడా ఇస్తామని స్పష్టం చేసింది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications