ముంబైలో సేల్స్‌మెన్‌గా దోపిడీలు: పుణెలో వ్యాపారవేత్త

వాదాలలోని రాం ఇండస్ట్రియల్ ప్రాంతంలోని ఓ కార్యాలయంలో 2013 మార్చిలో చోరీకి పాల్పడి ఒకేసారి ఆరు లాప్‌టాప్‌లను నిందితులు అపహరించారు. రాక్ మార్గ్ పోలీసులు ఈ చోరీ కేసును నమోదు చేశారు. చోరీకి గురైన ల్యాప్‌టాప్‌లకు సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ ఉండటంతో దాన్ని ట్రాక్ చేసిన పోలీసులు ప్రధాన నిందితుడైన నీలేష్ దత్తాత్రేయ చౌగల్ ఆచూకీని తెలుసుకుని అరెస్ట్ చేశారు. అతన్ని విచారించిన తర్వాత మిగితా ఇద్దరు నిందితులను కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికారి లక్ష్మీకాంత్ సోలంకి తెలిపారు.
తమ విచారణలో ఈ దొంగతనాలు, దోపిడీకలకు పాల్పడిన వారిలో దత్తాత్రేయ చౌగల్ ప్రధాన పాత్ర పోషించాడని తేలినట్లు తెలిపారు. దొంగతనాలు, దోపిడీలతోపాటు 110 నేరాలు వీరిపై నమోదయ్యాయని ఆయన చెప్పారు. దొంగతనాలకు పాల్పడే ముందురోజు వీరు ముగ్గురు సేల్స్ మెన్ ఉద్యోగం చేస్తున్నట్లు ఆయా ప్రాంతాల్లో పర్యటించి సేకరించిన వివరాలతో దోపీడీలకు పాల్పడే వారని ఆయన తెలిపారు. 2002లో చిన్నపాటి దొంగతనాలతో తన దినచర్యను ప్రారంభించిన చౌగల్, ఇప్పుడు భారీ దోపీడీలకు పాల్పడే స్థాయికి ఎదిగాడని చెప్పారు.
ఎలాంటి తాళాలలైనా నిమిషాల్లో బద్దలు కొట్టేయడంలో చౌగల్ ఎంతో నిపుణుడని అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ దిలీప్ పూల్పగారె తెలిపారు. దశాబ్ద కాలం నుంచి దోపిడీలకు పాల్పడిన చౌగల్, పుణెలోని హరికృప హౌజింగ్ సొసైటీలో విలాసవంతమైన డబుల్ బెడ్ రూం ప్లాట్‌ను కూడా కొనుగోలు చేశాడని పేర్కొన్నారు. అంతేగాక ఓ ఆటో రిక్షాను కొనుగోలు చేసి అద్దెకు ఇచ్చాడని తెలిపారు. 2008లో మంటుంగాలో భారీ దోపిడీకి పాల్పడిన వీరు అంధేరిలోని లోఖండ్వాలాలో కోటి రూపాయల ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు ఆయన చెప్పారు. త్వరలోనే వివాహం చేసుకునేందుకు కూడా చౌగల్ సిద్ధమవుతున్నట్లు వారు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications