Chandigarh-Dibrugarh Express: యూపీలో పట్టాలు తప్పిన దిబ్రూగఢ్ ఎక్స్ ప్రెస్-పలువురు మృతి..!

ఉత్తర్ ప్రదేశ్ లో చండీఘడ్-దిబ్రూగడ్ ఎక్స్ ప్రెస్ రైలు ఇవాళ పట్టాలు తప్పింది. మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో గోండా-ఝిలాహీ స్టేషన్ల మధ్య రైలు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో రైలులో ప్రయాణిస్తున్న పలువురు మృత్యువాత పడ్డారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన రైల్వే అధికారులు క్షతగాత్రుల్ని కాపాడే పనిలో నిమగ్నమయ్యారు. బాధితులకు అవసరమైన తక్షణ సాయం అందించాలని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అధికారుల్ని ఆదేశించారు.

Chandigarh-Dibrugarh Express derailed in uttar pradesh 2 passengers killed

ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో మధ్యాహ్నం 2:37 గంటలకు చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలులోని ఐదు నుంచి ఆరు కోచ్‌లు పట్టాలు తప్పాయి. గోండా, జిలాహి మధ్య ఉన్న పికౌరాలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు నంబర్ 15904 చండీగఢ్ నుండి అస్సాంలోని దిబ్రూగఢ్‌కు వెళుతోంది. మొత్తం 12 కోచ్‌లలో ఏసీ కంపార్ట్‌మెంట్‌లోని నాలుగు కోచ్‌లు జులాహి రైల్వే స్టేషన్‌కు కొన్ని కిలోమీటర్ల ముందు పట్టాలు తప్పాయి.

గోండా జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించడానికి సూచనలు ఇస్తున్నట్లు సిఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది. అటు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా కూడా రైలు ప్రమాద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+