బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Chandini: పోలీసు కస్టడీకి హీరోయిన్ మాజీ లవర్, మాజీ మంత్రికి సినిమా, మలేషియా దెబ్బా, మజాకా ?

|
Google Oneindia TeluguNews

చెన్నై/మదురై: మలేషియా రాయబార కార్యాలయం అధికారి, ప్రముఖ నటిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఐదు సంవత్సరాలు ఆమెతో సహజీవనం చేసి మోసం చేశాడని ఆరోపిస్తూ నమోదైన కేసులో అరెస్టు అయిన తమిళనాడు మాజీ మంత్రి మణికందన్ కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన హైకోర్టు మాజీ మంత్రిని విచారణ చెయ్యడానికి రెండు రోజులు కస్టడీలోకి తీసుకోవాని మహిళా పోలీస్ స్టేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జైల్లో ఉన్న మాజీ మంత్రిని రెండు రోజులు కస్టడీలోకి తీసుకుని విచారణ చెయ్యడానికి చెన్నై సిటీ పోలీసులు సిద్దం అయ్యారు. హీరోయిన్ తో బెడ్ రూమ్ లో ఎంజాయ్ చేసే సమయంలో మాజీ మంత్రి రహస్యంగా వీడియోలు తీసి ఆ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Illegal affair: కొత్త పెళ్లి కూతురు, సిమ్రాన్ ను నీటి సంప్ లో ముంచి చంపేసిన మొగుడు !Illegal affair: కొత్త పెళ్లి కూతురు, సిమ్రాన్ ను నీటి సంప్ లో ముంచి చంపేసిన మొగుడు !

హీరోయిన్ సీక్రెట్ లవ్ స్టోరి

హీరోయిన్ సీక్రెట్ లవ్ స్టోరి

నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన మాజీ మంత్రి మణికందన్ తనతో చెన్నైలోని శాస్త్రీనగర్ లో రహస్యంగా కాపురం పెట్టాడని, ఇద్దరూ కలిసి ఐదు సంవత్సరాలు కాపురం చేశామని నటి చాందిని ఆరోపిస్తోంది. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని, నీకు భార్య హోదా ఇస్తానని మాజీ మంత్రి మణికందన్ తనకు తమిళ సినిమా స్టోరీ చెప్పాడని, తనతో స్వర్గం చూసి తన సర్వస్వం దోచుకున్న తరువాత తననే మోసం చేశాడని తమిళ హీరోయిన్, మలేషియా రాయబార కార్యాలయం అధికారిని చాందిని ఆరోపిస్తూ చెన్నైలో కేసు పెట్టింది..

మాజీ మంత్రి బ్లాక్ మెయిల్ ?

మాజీ మంత్రి బ్లాక్ మెయిల్ ?


తన మీద నువ్వు పోలీసు కేసు పెడితే ఇంతకాలం మనం కాపురం చేసే సమయంలో రహస్యంగా బెడ్ రూమ్ లో తీసిన నీ అశ్లీల వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని మణికందన్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని నటి చాందిని చెన్నై సిటీ పోలీసు కమీషనర్ కార్యాలయంలో, మహిళా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. ఏరోజు చాందినిని మణికందన్ బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలుపెట్టాడో ఆరోజ నుంచి ఆమె విసిగిపోయి అతని మీద నమ్మకం లేక పోలీసు కేసు పెట్టింది.

హీరోయిన్ రివర్స్ గేర్ తో సార్ కు 700 ఎంఎం సినిమా

హీరోయిన్ రివర్స్ గేర్ తో సార్ కు 700 ఎంఎం సినిమా

హీరోయిన్ చాందినిని మణికందన్ బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలుపెట్టాడో ఆరోజ నుంచి ఆమె విసిగిపోయి అతని మీద నమ్మకం లేక పోలీసు కేసు పెట్టిందని ఆమె సన్నిహితులు అంటున్నారు. తనకు మొదటి నుంచి బెడ్ రూమ్ లో సీక్రెట్ కెమెరాలతో రికార్డు చేస్తున్నాడని మణికందన్ మీద అనుమానం ఉందని చాందిని ఇంతకు ముందే మీడియా ముందు చెప్పింది.

 రిసార్ట్ లో సార్ ఎంజాయ్

రిసార్ట్ లో సార్ ఎంజాయ్

నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్న నిన్ను కచ్చితంగా జైల్లో పెట్టిస్తానని హీరోయిన్ చాందిని మణికందన్ ను హెచ్చరించింది. చాందిని కేసు పెట్టిన రోజు నుంచి తప్పించుకుని తిరుగుతున్న మాజీ మంత్రి మణికందన్ చెన్నై నుంచి పరారైనాడు. గుట్టుచప్పుడు కాకుండా బెంగళూరు చేరుకున్న మణికందన్ ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని హెబ్బగుడిలోని ఓ ప్రముఖుడి రిసార్టులో దర్జాగా ఉన్నాడని చెన్నై పోలీసులకు తెలిసింది. బెంగళూరులోని రిసార్టులో మాజీ మంత్రి మణికందన్ తమిళనాడు పోలీసులకు అడ్డంగా చిక్కిపోయారు.

మాజీ మంత్రి ఫోన్లలోని పోర్న్ వీడియోలు సాక్షం ?

మాజీ మంత్రి ఫోన్లలోని పోర్న్ వీడియోలు సాక్షం ?

తమిళనాడు మాజీ మంత్రి మణికందన్ దగ్గర స్వాధీనం చేసుకున్న ఆయన రెండు మొబైల్ ఫోన్లు చూసిన పోలీసుల మైండ్ బ్లాక్ అయ్యింది. మణికందన్ రెండు మొబైల్ ఫోన్లలో వందకు పైగా పోర్న్ వీడియోలు ఉన్నాయని పోలీసు అధికారులు అంటున్నారు. అందులో హీరోయిన్ చాందిని పర్సనల్ ఫోటోలు ఉన్నాయని చెన్నై సిటీ పోలీసు అధికారులు అంటున్నారు.

ఫోరెన్సిక్ ల్యాబ్ కు మాజీ మంత్రి మొబైల్ ఫోన్లు

ఫోరెన్సిక్ ల్యాబ్ కు మాజీ మంత్రి మొబైల్ ఫోన్లు


మణికందన్ మొబైల్ ఫోన్లలో దిమ్మతిరిగిపోయే వీడియోలు బయటపడ్డాయని తెలిసింది. హీరోయిన్ చాందినితో ఆయన బెడ్ రూమ్ లో ఏకాంతంగా ఎంజాయ్ చేస్తున్న నగ్న వీడియోలు, ఇద్దరు మద్యం సేవిస్తున్న వీడియోలు, చాందిని బాత్ రూమ్ లో స్నానం చేస్తున్న సమయంలో తీసిన వీడియోలు 100కు పైగా ఉన్నాయని పోలీసు అధికారులు అంటున్నారు. ఆ మొబైల్ ఫోన్లను ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసుల సహాయంతో ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులకు అప్పగించారు.

 రెండు రోజులు పోలీసు కస్టడీకి మాజీ మంత్రి

రెండు రోజులు పోలీసు కస్టడీకి మాజీ మంత్రి

తమిళనాడు మాజీ మంత్రి మణికందన్ కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. మణికందన్ కు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన హైకోర్టు మాజీ మంత్రిని విచారణ చెయ్యడానికి రెండు రోజులు కస్టడీలోకి తీసుకోవాని శుక్రవారం చెన్నై మహిళా పోలీస్ స్టేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జైల్లో ఉన్న మాజీ మంత్రిని రెండు రోజులు కస్టడీలోకి తీసుకుని విచారణ చెయ్యడానికి పోలీసులు సిద్దం అయ్యారు.

సోమవారం ఏం జరుగుతుందో ?

సోమవారం ఏం జరుగుతుందో ?


శనివారం, ఆదివారం మాజీ మంత్రి మణికందన్ ను విచారణ చెయ్యడానికి మద్రాసు హైకోర్టు చెన్నై సిటీ పోలీసులకు అవకాశం ఇచ్చింది. హైకోర్టు ఈ కేసు విచారణ జులై 5వ తేదీ సోమవారానికి వాయిదా వేసింది. శనివారం, ఆదివారం మణికందన్ ను చెన్నై, మదురైలో విచారణ చేసే అవకాశం ఉందని సమాచారం. సోమవారం మళ్లీ మణికందన్ ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో మనవి చేస్తారా ?, లేక విచారణ పూర్తి చేసి ఆయన్ను జైలుకు పంపిస్తారా ? అనే విషయం వేచి చూడాలని న్యాయనిపుణులు అంటున్నారు.

English summary
The Chennai High Court has given permission to the police to take Manikandan into custody for 2 days and interrogate him
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X