పనిచేస్తున్న చంద్రయాన్ 2 ఆర్బిటర్-చంద్రయాన్ 3 ల్యాండర్ ఫొటోలు తీసిన వేళ...
చంద్రయాన్ 3 మిషన్ ను చేపట్టిన నాటి నుంచి ఇస్రో అన్నీ శుభవార్తలే చెబుతోంది. చంద్రయాన్ 2 విక్రమ్ ల్యాండర్ ను చంద్రుడిపై ల్యాండ్ చేయడంలో విఫలమైన ఇస్రో.. గతానుభవాల్ని మర్చిపోయి చంద్రయాన్ 3ను సాహసోపేతంగా ప్రయోగించడం దగ్గరి నుంచి ల్యాండర్ ను దించడం వరకూ అన్నీ సవ్యంగా సాగిపోయాయి. అదే సమయంలో అప్పటికే అక్కడ తిరుగుతున్న చంద్రయాన్ 2 ఆర్బిటర్ కూడా యాక్టివ్ అయింది.
అప్పుడెప్పుడో చంద్రుడిపైకి వెళ్లి అక్కడే ఉండిపోయిన చంద్రయాన్ 2 ఆర్బిటర్ ఇప్పుడు చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ ఫొటోలు తీస్తోంది. చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ ఉన్న చంద్రయాన్ 2 ఆర్బిటర్ తాజాగా తీసిన చంద్రయాన్ 3 ల్యాండర్ ఫొటోల్ని ఇస్రో తాజాగా ఎక్స్ లో షేర్ చేసింది. చంద్రయాన్ 2 ఆర్బిటర్ ఫొటోషూట్స్ చంద్రయాన్ 3 ల్యాండర్ అంటూ ఈ ఫొటోల్ని విడుదల చేసింది. దీంతో ఓవైపు చంద్రయాన్ 3, మరోవైపు చంద్రయాన్ 2 పంపుతున్న పిక్స్ తో భారతీయులు సంబరాలు చేసుకుంటున్నారు.

చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగగానే అప్పటికే అక్కడ యాక్టివ్ అయిన చంద్రయాన్ 2 ఆర్బిటర్ ఈ ఫొటోల్ని తీయడం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఓవైపు చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్, రోవర్ తీస్తున్న ఫొటోలు వీడియోలతో పాటు చంద్రయాన్ 2 ఆర్బిటర్ కూడా పంపుతున్న ఫొటోలు ఇప్పుడు ఇస్రో శాస్త్రవేత్తలను సంతోషంలో ముంచెత్తుతున్నాయి. చంద్రయాన్ 2 విఫలమైందంటూ అప్పట్లో దేశం యావత్తూ పడిన బాధను మరిపిస్తూ ఇప్పుడు యాక్టివ్ కావడంతో మరిన్ని అద్భుతాలు జరుగుతాయన్న అంచనాలున్నాయి.
Chandrayaan-3 Mission update :
— LVM3-M4/CHANDRAYAAN-3 MISSION (@chandrayaan_3) August 25, 2023
I spy you! 🙂
Chandrayaan-2 Orbiter
📸photoshoots
Chandrayaan-3 Lander!
Chandrayaan-2's
Orbiter High-Resolution Camera (OHRC),
-- the camera with the best resolution anyone currently has around the moon 🌖--
spots Chandrayaan-3 Lander
after the… pic.twitter.com/tIF0Hd6G0i
చంద్రయాన్ 2 ప్రాజెక్టులో విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేయించలేకపోయింది. ప్రతికూల వాతావరణ పరిస్ధితుల్లో విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై క్రాష్ ల్యాండింగ్ అయింది. అయితే అప్పటికే దాంతో విడిపోయిన ఆర్బిటర్ మాడ్యూల్ మాత్రం పరిభ్రమిస్తూనే ఉండిపోయింది. అయితే చంద్రుడిపై ఇన్నాళ్లు ఉండిపోయిన చంద్రయాన్ 2 ఆర్బిటర్ ఇప్పుడు తాజాగా వెళ్లిన చంద్రయాన్ 3 ల్యాండర్ ఫొటోలు తీసి పంపడంతో ఈ రెండు ప్రాజెక్టులూ దాదాపుగా విజయవంతమయ్యాయనే చర్చ జరుగుతోంది.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications