Chandrayaan 3 ఎఫెక్ట్: హిందూ దేశంగా చంద్రుడు-ల్యాండర్ దిగిన చోటు రాజధాని ! కొత్త డిమాండ్లు...
చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం తర్వాత భారత్ లో కొత్త కొత్త డిమాండ్లు మొదలయ్యాయి. ఇందులో చంద్రుడిపై మరిన్ని ప్రయోగాలు చేయాలనే పాజిటివ్ డిమాండ్లతో పాటు మరికొన్ని డిమాండ్లు వినిపిస్తున్నాయి. వీటిలో చంద్రుడిని హిందూ దేశంగా ప్రకటించాలనే డిమాండ్ తాజాగా తెరపైకి వచ్చింది. చంద్రుడిపై కాలు మోపిన నాలుగో దేశంగా భారత్ గుర్తింపు పొందడంతో దేశంలో కొందరు ఇాలాంటి డిమాండ్లు మొదలుపెట్టారు.
ఇప్పటికే ప్రధాని మోడీ చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ కాలు మోపిన ప్రదేశానికి శివశక్తిగా నామకరణం చేశారు. అలాగే చంద్రయాన్ 2 కాలు మోపిన ప్రాంతానికి తిరంగా పాయింట్ గా పేరు పెట్టారు. ఈ నామకరణాల సిరీస్ లోనే చంద్రుడిని ఏకంగా హిందూ దేశంగా ప్రకటించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. చంద్రుడిని 'హిందూ దేశంగా ప్రకటించాలని, అలాగే చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్ ల్యాండింగ్ సైట్‌ను దాని రాజధానిగా ప్రకటించాలని స్వామి చక్రపాణి మహారాజ్ అనే సాధువు డిమాండ్ చేశారు.

అఖిల భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు కూడా అయిన ఈయన.. తాజా డిమాండ్లు సంచలనం రేపుతున్నాయి. ఇతర మతాల కంటే ముందు చంద్రుడిపై భారత ప్రభుత్వం తన యాజమాన్యాన్ని ప్రకటించాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే ఈ మేరకు పార్లమెంటు కూడా ఓ తీర్మానాన్ని ఆమోదించాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో షేర్ చేసిన స్వామి చక్రపాణి మహారాజ్.. ఏ ఉగ్రవాదీ అక్కడికి చేరుకోకుండా కేంద్రం త్వరగా చర్య తీసుకోవాలని కూడా కోరారు.
చంద్రుడిని పార్లమెంటు హిందూ సనాతన దేశంగా ప్రకటించాలని, చంద్రయాన్ 3 ల్యాండింగ్ ప్రదేశాన్ని రాజధానిగా 'శివశక్తి పాయింట్'గా అభివృద్ధి చేయాలని, తద్వారా జిహాదీ మనస్తత్వం ఉన్న ఏ ఉగ్రవాది అక్కడికి చేరుకోకూడదని వీడియోలో
స్వామి చక్రపాణి మహారాజ్ పేర్కొన్నాడు. ఇప్పటికే శివశక్తి, తిరంగా పాయింట్లను ప్రకటించిన ప్రధాని మోడీ, దాన్ని సమర్ధిస్తున్న బీజేపీ నేతలు ఇప్పుడు ఈ డిమాండ్లపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు ఈ డిమాండ్లు చేసిన స్వామి చక్రపాణికి విచిత్రమైన విన్యాసాలు కొత్తేమీ కాదు. 2020లో దేశం కరోనావైరస్ మహమ్మారితో విలవిల్లాడుతుంటే ఆయన ఢిల్లీలో "గౌమూత్ర పార్టీ"ని నిర్వహించాడు. అక్కడ ఆయనతో పాటు తోటి అఖిల భారత హిందూ మహాసభ సభ్యులు కరోనా వైరస్ కు ముందుగా ఆవు మూత్రం తాగారు. జంతువులను చంపి తినే వ్యక్తుల కారణంగానే కరోనా వైరస్ వచ్చిందని, మీరు ఒక జంతువును చంపినప్పుడు, అది ఆ ప్రదేశంలో విధ్వంసం కలిగించే ఒక విధమైన శక్తిని సృష్టిస్తుందని అప్పట్లో ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.
संसद से चांद को हिंदू सनातन राष्ट्र के रूप में घोषित किया जाए,चंद्रयान 3 के उतरने के स्थान "शिव शक्ति पॉइंट" को उसकी राजधानी के रूप में विकसित हो ,ताकि कोई आतंकी जिहादी मानसिकता का वहा न पहुंच पाए 🌸🙏🌸स्वामी चक्रपाणि महाराज, राष्ट्रीय अध्यक्ष, अखिल भारत हिंदू महासभा/ संत महासभा pic.twitter.com/HPbifYFZzX
— Swami Chakrapani Maharaj (@SwamyChakrapani) August 27, 2023
-
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications