P Veeramuthuvel : చంద్రయాన్ 3 మాస్టర్ మైండ్ వీరముత్తువేల్ ! మద్రాస్ ఐఐటియన్ ఘనత ఇదీ..

భారత అంతరిక్ష రంగాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లుందని భావిస్తున్న చంద్రయాన్ 3 రేపు ఏపీలోని శ్రీహరికోట నుంచి నింగిలోకి ఎగరబోతోంది. చంద్రుడి నిగూఢ రహస్యాలు శోధించే లక్ష్యంతో ఇస్రో చేస్తున్న ఈ ప్రయోగం కోసం మన దేశంతో పాటు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇది విజయవంతమైతే యూఎస్, యూఎస్ఎస్ఆర్, చైనా తర్వాత నాలుగోదేశంగా భారత్ రికార్డులకెక్కబోతోంది. అయితే ఇంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు వెనుక ఉన్న ఓ మద్రాస్ ఐఐటీయన్ గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

చంద్రయాన్ 3 మిషన్ ప్రయోగాన్ని ప్లాన్ చేసి విజయవంతంగా పరీక్షించడం ద్వారా భారతదేశం సాధించిన ఘనత గురించి దేశంలోని ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ గురించి మాత్రం చాలా మందికి తెలియదు. ఈ ప్రాజెక్ట్ మొత్తం ఇస్రో శాస్త్రవేత్త పి వీరముత్తువేల్ యొక్క ఆలోచనే. ఇస్రో శాస్త్రవేత్త వీరముత్తువేల్ తమిళనాడులోని విల్లుపురం ప్రాంతానికి చెందిన వారు. ఇస్రోలో సీనియర్ శాస్త్రవేత్తగా పలు ర్యాంకులు సాధించారు. చంద్రయాన్ 3 హెడ్ గా ఉన్న ఆయన ప్రస్తుతం మూన్ మిషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హోదాలో ఉన్నారు.

pveeramuthuvel

చంద్రయాన్ 3 ప్రాజెక్టులో ఆయన తన నైపుణ్యం అంతా ధారబోశారు. సెప్టెంబర్ 7న చంద్రయాన్-2 ల్యాండర్ చంద్రునిపై సాఫ్ట్-ల్యాండింగ్ చేయడంలో విఫలమైన తర్వాత ఇస్రోకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ఎం. వనిత స్ధానంలో వీరముత్తువేల్ ను చంద్రయాన్ మిషన్ డైరెక్టర్‌గా నియమించారు. అయితే చంద్రయాన్ 3 మిషన్‌కు ప్రస్తుతం బాధ్యత వహిస్తున్న వీరముత్తువేల్.. గతంలో చంద్రయాన్ 2 మిషన్‌లోనూ కీలక పాత్ర పోషించారు.

చంద్రయాన్ 2 ప్రాజెక్టులో వీరముత్తువేల్ కృషిని గుర్తించిన ప్రభుత్వం.. ఆయన్ను చంద్రయాన్ 3కు ఛీఫ్ గా నియమించింది. ఆయన నాలుగేళ్ల కఠోర శ్రమతో ఎంతో అప్ గ్రేడ్ చేసిన చంద్రయాన్ 3ని రేపు ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు. చంద్రునిపై భారతదేశ రెండో మిషన్ చంద్రయాన్-2 2019 జూలై 22న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి నింగికి ఎగిరింది. కానీ సెప్టెంబర్ 6 తెల్లవారుజామున చంద్రునిపై విక్రమ్ లూనార్ ల్యాండర్ కూలిపోవడంతో మిషన్ విఫలమైంది. అయితే ఈసారి చంద్రయాన్ 3లో భాగంగా ఆగస్ట్ 23 లేదా ఆగస్టు 24న విక్రమ్ ల్యాండర్‌ని సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసేందుకు ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+