పంజాబ్ పోరు-కేజ్రివాల్ పై కుమార్ విశ్వాస్ ఆరోపణలు-విచారణకు ప్రధానికి చన్నీ వినతి

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు రంగం సిద్ధమవుతోంది. ఇవాళ్టితో రాష్ట్రంలో ప్రచార పర్వం ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజకీయ నేతల మధ్య మాటల తూటాలు కూడా అదే స్ధాయిలో పేలుతున్నాయి. ముఖ్యంగా అరవింద్ కేజ్రివాల్, చరణ్ జీత్ సింగ్ చన్నీ, ప్రధాని మోడీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా గద్దె దింపేందుకు ఆప్ తో పాటు బీజేపీ కూటమి కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్నీ ఏ పార్టీ కూడా వదులుకోవడం లేదు. తాజాగా సీఎం చన్నీ చేసిన యూపీ, బీహార్ భయ్యా వ్యాఖ్యల్ని ప్రధాని మోడీతో పాటు బీజేపీ నేతలు, కేజ్రివాల్ కూడా తీవ్రంగా టార్గెట్ చేశారు. దీంతో చన్నీ ఎదురుదాడికి దిగారు. కుమార్ విశ్వాస్ కేజ్రివాల్ పై చేసిన ఆరోపణల్ని టార్గెట్ చేశారు. వీటిపై దర్యాప్తు చేయించాలని ప్రధాని మోడీని సీఎం చన్నీ కోరారు.

charanjit channi urges pm modi for probe on kumar viswass allegations against kejriwal

తన యూపీ,బీహార్,ఢిల్లీ దే భాయీ వ్యాఖ్యపై రాజకీయ దాడి నుండి తెలివిగా తప్పించుకునేందుకు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ ఎదురుదాడి ప్రారంభించారు. కుమార్ విశ్వాస్ వ్యాఖ్యలు. కుమార్ విశ్వాస్ కేజ్రివాల్ పై చేసిన ఖలిస్తాన్ వ్యాఖ్యల్ని ప్రసార మాధ్యమాల్లో వాడకుండా విధించిన నిషేధాన్ని ఈసీ వెనక్కి తీసుకుంది. దీంతో కేజ్రివాల్ పై చేసిన కిుమార్ విశ్వాస్ వ్యాఖ్యలు సమంజసమే అని ఈసీ నమ్మినట్లయిందని చన్నీ భావిస్తున్నారు. దీంతో వీటిపై విచారణ చేయించాలని ప్రధాని మోడీని ఆయన కోరారు.

రాజకీయాలను పక్కన పెడితే, వేర్పాటువాదంతో పోరాడుతున్నప్పుడు పంజాబ్ ప్రజలు భారీ మూల్యం చెల్లించుకున్నారని చన్నీ తెలిపారు. గౌరవనీయ ప్రధానమంత్రి ప్రతీ పంజాబీ యొక్క ఆందోళనను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. దీంతో ఇప్పుడు తనపై వచ్చిన యూపీ-బీహార్ వ్యాఖ్యల నుంచి జనం దృష్టిని మళ్లించేందుకే కుమార్ విశ్వాస్ కేజ్రివాల్ పై చేసిన ఆరోపణలపై చన్నీ విచారణ కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే చన్నీ వ్యాఖ్యలు కాంగ్రెస్ కు తీవ్ర నష్టం కలిగించినట్లు సొంత పార్టీ నేతలు సైతం భావిస్తున్నారు. వీటిపై చన్నీతో ప్రియాంక గాంధీ, ఇతర నేతలు కూడా ఇప్పటికే వివరణ కూడా ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+