కారులో బూడిదైన శవాలు: వేడుకలనుంచి వస్తూ 3గురు అమ్మాయిల మృతి

రోహతక్/ గ్రేటర్ నోయిడా: హర్యానాలోని ఝాజ్జార్ జిల్లాలో నలుగురు యువకులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. వారి శవాలు ఢిల్లీకి చెందిన ఓ కారులో కాలి బూడదయ్యాయి. ఆ కారుకు ఢిల్లీ రిజిస్ట్రేషన్ నెంబర్ - డిఎల్8సి ఎఫ్ 7229 ఉంది. నలుగురు యువకులు కూడా 16 నుంచి 32 ఏళ్ల మధ్య వయస్సు గలవారు.

వారు ఢిల్లీలోని నజఫ్‌గడ్‌లో గల మిత్రావ్ గ్రామానికి చెందినవారు. వారిని హత్య చేసి వారితో పాటు కారును హంతకులు దగ్ధం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సాక్ష్యాలు దొరక్కకుండా, మృతుల ఆనవాళ్లు లభించకుండా చేసే ఉద్దేశంతో ఆ పనికి ఒడిగట్టి ఉంటారని భావిస్తున్నారు.

Charred bodies of 4 youth found inside burnt-out Delhi car

అదలావుంటే, గ్రేటర్ నోయిడాలోని యుమునా ఎక్స్‌ప్రెస్ వేపై దంకౌర్ వద్ద జరిిగన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థినులు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆగ్రాలో నూతన సంవత్సరం వేడుకల్లో పాల్గొని గ్రేటర్ నోయిడాకు తిరిగి వస్తుండగా గురువారం తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.

మృతులను శివాని రావత్, అయూషి, అకాంఖ్యలుగా గుర్తించారు. గాయపడినవారి మిత్రులను లబీనా, సుమీత్, శేఖర్‌లుగా గుర్తించారు. కారు వేగంగా ప్రయాణిస్తుండడంతో అదుపు తప్పి ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. అదుపు తప్పి కారు డివైడర్‌ను ఢీకొట్టింది. కారు పల్టీలు కొట్టి వ్యతిరేక దిశలో ఉన్న లేన్‌లో పడింది. కారును ఎవరు నడుపుతున్నారనేది తెలియదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+