ఒబామా రాక: కెమికల్ బాంబు దాడి బెదిరింపు, అది ఎక్కడిది?
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా భారత్ పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. కాగా, ట్విట్టర్‌లో ఓ బెదిరింపు వచ్చింది. రసాయన బాంబు దాడి బెదిరింపు వచ్చింది. ఒబామా పర్యటన నేపథ్యంలో ఇది కలకలం రేపుతోంది.
అయితే, ఈ ట్వీట్ ఉత్తిదా లేక నిజమైన బెదిరింపు ట్వీటా అనే కోణంలో జాతీయ దర్యాఫ్తు సంస్థ (ఎన్ఐఏ) విచారిస్తోంది. ఐసిస్‌లో చేరిన వ్యక్తి ఈ బెదిరింపుకు పాల్పడుతున్నారా పరిశీలిస్తున్నారు. ఇటీవల థానేలో నలుగురు యువకులు ఐసిస్‌లో చేరేందుకు వెళ్లారు. అనంతరం ఒకరు వెనక్కి తిరిగి వచ్చాడు.

ఇది ఐసిస్‌లో చేరిన భారత దేశానికి చెందిన ఓ యువకుడి బెదిరింపు ట్వీట్ కావొచ్చని అనుమానిస్తున్నారు. ట్వీట్ చేసిన విధానం అలా కనిపిస్తోందని అంటున్నారు.
సదరు ట్వీట్‌లో ముస్లీంలకు శత్రువు అయిన వ్యక్తి భారత్‌కు వస్తున్నాడని, భారత్ ముస్లీంలు కెమికల్ బాంబులో నిష్ణాతులని, ఈ నేపథ్యంలో కెమికల్ బాంబు మంచి ఉపాయమని ఉంది.
అయితే, ఇది ఉత్తిదే కావొచ్చునని కూడా భావిస్తున్నారు. సాధారణంగా తీవ్రవాదులు తమ ప్రణాళికను పబ్లిక్ డొమైన్లలో పెట్టరు. అయితే, ఇది సంచలనం సృష్టించడినికో లేదా సెక్యూరిటీ ఏజెన్సీస్‌ను తప్పుదోవ పట్టించేందుకో కావొచ్చునని అనుమానిస్తున్నారు. కాగా, హై ప్రొఫైల్ పర్సనాలీటీస్ వచ్చే సందర్భాల్లో ఇలాంటి ట్వీట్లు, సందేశాలు తరుచు వస్తుంటాయి కూడా.












Click it and Unblock the Notifications