విషాదం : పాక్కుంటూ కిటికీ వద్దకు.. 12వ ఫ్లోర్ నుంచి కిందపడ్డంతో..

Subscribe to Oneindia Telugu

చెన్నై : పొద్దున్నే అమ్మ నాన్న ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. ఇంతలో నిద్రలేచిన ఏడాదిన్నర పిల్లవాడు మంచంపై పాక్కుంటూ కిటికీ ఉన్న వైపుకు వెళ్లాడు. ఏసీ ఉన్న గది కావడంతో.. సాధారణంగానే ఎప్పుడూ మూసుండే ఆ కిటికీని అప్పడప్పుడు మాత్రమే వెంటిలేషన్ కోసం తెరిచి పెడుతుంటారు. అలా మంగళవారం ఉదయం కూడా ఆ కిటికీ తెరుచుండడంతో.. కిటికీ దగ్గరకు చేరుకున్న ఆ బాలుడు ప్రమాదవశాత్తు కిందపడి చనిపపోయాడు.

 Chennai: Boy falls through 12th floor window

12 వ ఫ్లోర్ నుంచి కిందపడడంతో పిల్లవాడు అక్కడిక్కడే మ్రుతి చెందాడు. చెన్నైలోని వల్లజా రోడ్ లో ఉన్న 17 అంతస్తుల నారాయణ అరిహంట్ ఓసియన్ టవర్స్ లో మంగళవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఈ విషాదం చోటు చేసుకుంది.

అయితే బాలుడు కిందపడే సమయంలో.. అదే అపార్ట్ మెంట్ లో ఇళ్ల చూడడానికని వచ్చిన కొంతమంది వ్యక్తులు బాలుడిని కాపాడడానికి అటువైపుగా పరుగు తీయగా, అప్పటికే కిందపడ్డ బాలుడు మృతి చెందాడు. చనిపోయిన బాలుడి పేరు మహమ్మద్ ఫాథూస్ కాగా, బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు యాకూబ్, అశీరా బేగం పిల్లవాడి కోసం వెతకడం మొదలుపెట్టారు. ఇంతలో సెక్యూరిటీ గార్డ్ వచ్చి జరిగిన విషయం చెప్పడంతో.. ఇద్దరూ కన్నీటి పర్యంతమయ్యారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A one-and-a-half-year-old-boy died in a freak accident after he fell through a window without a grill from the bedroom of the 12th floor flat in a gated community on Wallajah Road, on Tuesday morning.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి