• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇకపై చెన్నై సెంట్రల్ పేరు మారనుంది... కామరాజ్‌ను కాంగ్రెస్ అవమానించింది: మోడీ

|

కంచీపురం: త్వరలో లోక్‌సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో తమిళనాడు ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు మోడీ పావులు కదిపారు. ఇందులో భాగంగా తమిళుల ఆరాధ్య దైవం మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ పేరును చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు పెడుతున్నట్లు ప్రకటించారు. ఇకపై చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ పేరును అన్నాడీఎంకే వ్యవస్థాపకులు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ స్టేషన్‌గా పిలువబడుతుంది. ఇక తమిళనాడు నుంచి బయలుదేరే విమానాల్లో ప్రకటనలు కూడా తమిళంలో చేయించాలనే ఆలోచన తమ ప్రభుత్వం చేస్తున్నట్లు ప్రధాని మోడీ చెప్పారు.

ఎన్నికల వేళ ఎంజీ రామచంద్రన్ పేరు జపించిన మోడీ

ఎన్నికల వేళ ఎంజీ రామచంద్రన్ పేరు జపించిన మోడీ

ఎంజీ రామచంద్రన్ తమిళనాడులోని బడుగుబలహీన వర్గాల వారికోసం, వారి అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని మోడీ కొనియాడారు. వారికోసం ఎన్నో ప్రభుత్వ సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఈ పథకాల ద్వారా పేదరికాన్ని పారద్రోలేందుకు కృషి చేశారని చెప్పారు. ఇక కంచీపురంలోని కిలంబాక్కంలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోడీ ఈ మేరకు ప్రకటన చేశారు. మోడీ సభలో బీజేపీ మిత్రపక్షం అన్నాడీఎంకే కూడా కనిపించింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనీ స్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం, పీఎంకే నేతలు రామదాస్, అంబుమణి రామదాస్, ఏఐఎన్ఆర్ కాంగ్రెస్‌కు చెందిన రంగస్వామిలు కూడా మోడీ సభకు హాజరయ్యారు.

నాకు దేశప్రజలూ హైకమాండ్: మోడీ

నాకు దేశప్రజలూ హైకమాండ్: మోడీ

ప్రాంతీయ పార్టీల ఆకాంక్షలను నెరవేర్చగల పార్టీ ఒక్క బీజేపీనే అని ప్రధాని మోడీ అన్నారు. తనకు దేశప్రజలే హైకమాండ్ అని చెప్పిన ప్రధాని... కాంగ్రెస్‌పై ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇతర విపక్షాలు తమ స్వలాభం కోసం రాజకీయాలు చేస్తున్నాయని మండిపడిన మోడీ.... కాంగ్రెస్ వారి కుటుంబ లాభాలకోసం ఏసీ గదుల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటుందని తమిళనాడు గ్రామాల్లో కూర్చుని కాదని అన్నారు. విపక్షాలకు బలమైన దేశం కానీ, దేశభద్రత కోసం బలమైన బలగాలు కానీ అవసరం లేదని మోడీ ధ్వజమెత్తారు. అందుకే తనపై విమర్శలు ఎక్కుపెట్టారని అన్నారు.

మాజీ సీఎం కె.కామరాజ్‌ను కాంగ్రెస్ ఎలా అవమానించిందో తెలుసు..?

మాజీ సీఎం కె.కామరాజ్‌ను కాంగ్రెస్ ఎలా అవమానించిందో తెలుసు..?

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత కె.కామరాజ్‌ను ఓ కుటుంబం ఎలా అవమానానికి గురిచేసిందో తమిళ ప్రజలు మరువబోరని అన్న మోడీ... కామరాజ్ బడుగుబలహీన వర్గాల వారి పక్షాన నిలిచినందుకే అన్ని అవమానాలను భరించాల్సి వచ్చిందన్నారు. నాటి ఎమర్జెన్సీ పరిస్థితులను గుర్తు చేసిన ప్రధాని మోడీ... రాజ్యాంగపరంగా నాటి ముఖ్యమంత్రి ఎంజీఆర్ గవర్నర్‌ను ఎన్నుకోగా.... రాజకీయ విభేదాలు కారణంగా అతని నిర్ణయాన్ని రద్దు చేస్తూ ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చాయని కాంగ్రెస్‌పై ఘాటు విమర్శలు చేశారు ప్రధాని మోడీ. రాజ్యాంగంలోని ఆర్టికల్ 356ను హేళన చేస్తూ దాదాపు 50 ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలను రద్దు చేసిందని చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్‌కు దేశం పట్టదు..మోడీని మాత్రమే విమర్శిస్తారు

కాంగ్రెస్‌కు దేశం పట్టదు..మోడీని మాత్రమే విమర్శిస్తారు

ఇక డీఎంకేపై కూడా కత్తులు నూరారు ప్రధాని మోడీ. ఆపార్టీకి విలువలకంటే అవకాశవాద రాజకీయాలే ముఖ్యమయ్యాయని మోడీ ధ్వజమెత్తారు. అందుకే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుందని విమర్శించారు. అంతేకాదు మోడీని ఎవరు బాగా తిట్టాలో పోటీపడి మరీ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయని ప్రధాని ఎద్దేవా చేశారు. "కొందరు నన్ను దూషిస్తారు, మరికొందరు నా పేదరికాన్ని ఎత్తి చూపుతారు, ఇంకొందరు నా కుటుంబంపై ఆరోపణలు చేస్తారు.. ఇంకొందరు నా కులాన్ని ఆధారం చేసుకుని విమర్శిస్తారు.మరో కాంగ్రెస్ నేత అయితే తనను చంపేస్తానని అంటాడు" అని మోడీ చెప్పారు. అయితే ఎవరో భయపెడితే భయపడే వాడిని కానని మోడీ చెప్పారు. తను ఉన్నది తన బాధ్యత నిర్వర్తించేందుకే అని అన్నారు. తన ప్రతి రక్తపు బొట్టు, తీసుకునే శ్వాస భారతదేశ అభివృద్ధి కోసం, 130 కోట్ల భారతీయుల కోసమే ఉంటుందని మోడీ చెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Prime Minister Narendra Modi on Wednesday announced the renaming of Chennai Central railway station after AIADMK founder and former Tamil Nadu chief minister late M G Ramachandran (MGR).Modi also said his government was seriously thinking of ensuring that announcements in flights to and from Tamil Nadu are made in Tamil language.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more