చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాలితో తన్నిన ట్రాఫిక్ పోలీసు, గర్బిణి మృతి, క్రిమినల్, హైకోర్టు, సీఎం పళని పరిహారం!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Traffic policeman kicked Pregnant Woman

చెన్నై: తమిళనాడులోని తిరుచ్చి-తంజావూరు హైవేలో హెల్మెట్ పెట్టుకోలేదని దంపతులు వెలుతున్న బైక్ ను ఇన్స్ పెక్టర్ కామరాజ్ కాలితో బలంగా తన్నడంతో గర్బిణి ఉష (30) మృతి చెందిన కేసుకు సంబంధించి మద్రాసు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇన్స్ పెక్టర్ కామరాజ్ ఓ పోలీసు అధికారిలా కాకుండా ఓ క్రిమినల్ లాగా ప్రవర్తించాడని మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ ఆగ్రహాం వ్యక్తం చేశారు. కామరాజ్ లాంటి వ్యక్తులు పోలీసు శాఖలో ఉండటం సిగ్గచేటు అంటూ మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ అసహనం వ్యక్తం చేశారు.

 సీఎం పరిహారం

సీఎం పరిహారం

ట్రాఫిక్ పోలీసు ఇన్స్ పెక్టర్ కామరాజ్ తీరుతో మరణించిన గర్బిణి ఉష కుటుంబ సభ్యులకు రూ. 7 లక్షలు నష్టపరిహారం అందిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి అన్నారు. ఇలాంటి దుర్ఘటన జరగడం చాలభాదకరమని ముఖ్యమంత్రి ఎడప్పాడవ పళనిస్వామి విషాదం వ్యక్తం చేశారు.

బీజేపీ డిమాండ్

బీజేపీ డిమాండ్

నిండు గర్బిణి ఉష మరణానికి కారణం అయిన టాఫ్రిక్ పోలీసు ఇన్స్ పెక్టర్ కామరాజ్ ను సస్పెండ్ చేసి అరెస్టు చేసి జైలుకు పంపించారు. గర్బిణి ఉష మరణానికి కారణం అయిన కామారాజ్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షురాలు తమిళసై సౌందరరాజన్ డిమాండ్ చేశారు.

పోలీసు కాదు నీచుడు

పోలీసు కాదు నీచుడు

బుధవారం రాత్రి ట్రాఫిక్ పోలీసు ఇన్స్ పెక్టర్ కామరాజ్ కాలితో బలంగా తన్నడంతో రాజా, ఉష దంపతులిద్దరూ బైక్ మీద నుంచి నడిరోడ్డు మీద కుప్పకూలిపోయారు. ఈ ఘటనలో ఉషకు తీవ్ర గాయాలు కావటంలో సంఘటనా స్థలంలోనే మరణించింది. ఉష భర్త రాజాకు తీవ్ర గాయలైనాయి.

కామరాజ్ కు అదే పని

కామరాజ్ కు అదే పని

ట్రాఫిక్ పోలీస్ ఇన్స్ పెక్టర్ కామరాజ్ ప్రతి రోజూ తిరుచ్చి-తంజావూరు హైవేలో వాహనాలు నిలిపి బెదిరించి బలవంతంగా డబ్బులు వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించుకుండా స్వాహా చేస్తున్నాడని, అతనికి ఎప్పుడు అదే పని అని స్థానికులు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు.

English summary
Chennai high court condemns the Trichy incident. Chennai high court chief justice Indira banerjee says that Its criminal activity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X