చెట్టు కింద కూర్చున్నవారిపై పిడుగుపాటు: ఏడుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు
రాంచీ: ఛత్తీస్గఢ్లో రాష్ట్రంలో పిడుగుపాటు పెను విషాదాన్ని నింపింది. బలోదాబాజార్ భటపరా జిల్లాలోని మోహ్ర గ్రామంలో పిడుగుపాటుకు గురై ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను అధికారులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. పిడుగు పడిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో బాధితులంతా చెట్టుకింద కూర్చుని మాట్లాడుకుంటున్నారు. మృతులను సురేష్ సాహు, సంతోష్ సాహు, పప్పు సాహు, పోఖారం విశ్వకర్మ, థానేశ్వర్ సాహు, దేవదాస్, విజయ్ సాహులుగా అధికారులు గుర్తించారు.

చేతన్ సాహు, బిందారం సాహు, బిసంభర్ సాహు గాయపడ్డారని స్థానికులు చెప్పారు. మెరుగైన చికిత్స కోసం వారందరిని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. వారికి చికిత్స కొనసాగుతున్నట్లు వెల్లడించారు. కాగా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా, రాష్ట్రంలో 2022-23లో 334 పిడుగు మరణ కేసులు, 2023-24లో మరో 287 మరణాలు నమోదయ్యాయి.
భారీ వర్షాల హెచ్చరిక
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. కొరియా, కోర్బా, ధమ్తరి, గరియాబంద్, దంతేవాడ, సుక్మా, కాంకేర్, బీజాపుర్, నారాయణపుర్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అంతేగాక, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని, పిడుగులు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది.
Chhattisgarh: Seven killed, three injured in lightning strike in Baloda Bazar
— ANI Digital (@ani_digital) September 8, 2024
Read @ANI Story lhttps://t.co/LXqGKtej5X#Chattisgarh #ChattisgarhLightning pic.twitter.com/ewtAAtp7tQ












Click it and Unblock the Notifications