ఛత్తీస్‌గఢ్‌లో విమాన ప్రమాదం?.. అసలేం జరిగిందంటే?
ఛత్తీస్‌గఢ్‌లో విమాన ప్రమాదం జరిగినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై అధికారులు స్పష్టతనిచ్చారు. జష్పూర్ జిల్లాలో చార్టర్డ్ విమానం కూలిపోయిందన్న వార్తల్లో నిజం లేదని.. అటువంటి ప్రమాదానికి ఎటువంటి ఆధారాలు లభించలేదని ఉన్నతాధికారులు వెల్లడించారు. జష్పూర్ కలెక్టర్ రోహిత్ ఈ ఉదంతంపై స్పందిస్తూ.. అడవిలో విమానం కూలినట్లు ఎక్కడా ఆనవాళ్లు కనిపించలేదని స్పష్టం చేశారు.
స్థానిక గ్రామస్తులు కొంతమంది విమానం చాలా తక్కువ ఎత్తులో ప్రయాణించడం చూశామని చెప్పడంతో ఈ పుకార్లు వ్యాపించాయి. అయితే దీనిపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తక్షణమే స్పందించి.. ఛత్తీస్‌గఢ్‌లో ఈ రోజు ఎటువంటి విమాన ప్రమాదం జరగలేదని అధికారిక ప్రకటన విడుదల చేసింది. విమాన ప్రమాదం వార్తలను మంత్రిత్వ శాఖ పూర్తిగా తోసిపుచ్చింది.

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) వర్గాలు కూడా ఈ ప్రాంతంలో ఏ విమానంతోనూ సంబంధాలు తెగిపోలేదని ధ్రువీకరించాయి. కలెక్టర్ రోహిత్ వ్యాస్ మాట్లాడుతూ.. తాము పొరుగు రాష్ట్రాలైన జార్ఖండ్, ఒడిశాలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లతో కూడా మాట్లాడామని తెలిపారు. జార్ఖండ్ అధికారులు తమ నియంత్రణలో ఉన్న ఏ విమానమూ ఆ ప్రాంతంలో అదృశ్యం కాలేదని స్పష్టం చేయగా.. ఒడిశా అధికారులు కూడా అదే విషయాన్ని వెల్లడించారని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాద సంకేతాలు లేకపోయినా, అధికారికంగా పూర్తి స్థాయి స్పష్టత కోసం వేచి చూస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసు, జిల్లా యంత్రాంగం బృందాలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్నాయని, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయని అధికారులు వెల్లడించారు.
#BREAKING
— Nabila Jamal (@nabilajamal_) April 20, 2026
A private aircraft has crashed into a hillside in Chhattisgarh's Jashpur district after reportedly hitting a tree in a forested area
The aircraft appears to be an Air Ambulance. It reportedly crashed into trees near a forested area
Visuals from spot show thick smoke… pic.twitter.com/d6L5Ol7aSw












Click it and Unblock the Notifications