Video : ఎర్రటి ఎండలో లాఠీ చేతపట్టి... గర్భంతో ఉన్నప్పటికీ.. ఆ మహిళా డీఎస్పీకి సెల్యూట్...
కరోనా సెకండ్ వేవ్ జనాలను బెంబేలెత్తిస్తోంది... పెరుగుతున్న కేసులు,కిక్కిరిసిపోతున్న ఆస్పత్రులు,ఆక్సిజన్ కొరత... వెరసి గతేడాది పరిస్థితులే మళ్లీ పునరావృతమవుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం ప్రజలకు పదేపదే కరోనా జాగ్రత్తలు గుర్తుచేస్తోంది. ఇంతటి కష్టకాలంలోనూ ప్రాణాలను రిస్క్ చేసి మరీ వైద్యులు,పోలీసులు,ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్స్ తమ సేవలను కొనసాగిస్తున్నారు. ఛత్తీస్‌గడ్‌లోని దంతెవాడలో స్థానిక మహిళా డీఎస్పీ ఎర్రటి ఎండలో లాఠీ చేతపట్టి విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఆమె గర్భంతో ఉన్నప్పటికీ... కోవిడ్ పరిస్థితుల్లోనూ విధులు నిర్వర్తిస్తుండటం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Recommended Video


ఎవరా మహిళా డీఎస్పీ...
ఆ మహిళా డీఎస్పీ పేరు శిల్పా సాహు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బస్తర్ డివిజన్‌లోని దంతెవాడలో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో లాక్‌డౌన్ అమలులో ఉండటంతో.. ప్రజలు నిబంధనలు పాటిస్తున్నారో లేదో పర్యవేక్షించేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఆమె గర్భంతో ఉన్నప్పటికీ... ఎర్రటి ఎండలో చేతిలో లాఠీ పట్టుకుని దంతెవాడ వీధుల్లో,రోడ్లపై తిరుగుతూ ప్రజలకు కరోనా జాగ్రత్తలు చెబుతున్నారు. పని లేకపోయినా అనవసరంగా బయట తిరిగేవారిని మందలిస్తున్నారు. ముఖానికి మాస్కు పెట్టుకోవాలని,భౌతిక దూరం పాటించాలని,షాపుల వద్ద గుమిగూడవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆమెకు సెల్యూట్ అంటున్న నెటిజన్లు...
డీఎస్పీ శిల్పా సాహుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గర్భంతో ఉన్నప్పటికీ ప్రాణాలను రిస్క్ చేసి మరీ విధులు నిర్వర్తిస్తున్నందుకు నెటిజన్లు ఆమెకు సెల్యూట్ చేస్తున్నారు. దీనిపై డీఎస్పీ శిల్పా సాహు మాట్లాడుతూ... విశ్రాంతి తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రజల కోసమే తాను విధులు నిర్వహిస్తున్నానని చెప్పారు. కరోనా సోకుతుందన్న భయం లేదని... తగిన జాగ్రత్తలతోనే విధులు నిర్వహిస్తున్నానని చెప్పారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒక డీఎస్పీగా తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తిస్తున్నానని చెప్పారు.

ఛత్తీస్‌గఢ్‌లో లాక్‌డౌన్
ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం(ఏప్రిల్ 20) నుంచి రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల్లో లాక్‌డౌన్ అమలుకానుంది. ఇప్పటికే రాష్ట్రంలోని 24 జిల్లాల్లో లాక్‌డౌన్ అమలులో ఉండగా బస్తర్,సుక్మా,కొండగావ్,కంకేర్ నారాయణపూర్ జిల్లాల్లోనూ నేటి నుంచి లాక్‌డౌన్ అమలుకానుంది. లాక్‌డౌన్‌లో నిత్యావసర సరుకులను ప్రభుత్వమే ఇళ్ల వద్దకు డోర్ డెలివరీ చేయనుంది. రేషన్ షాపులు నేరుగా వినియోగదారుల ఇళ్లకే రేషన్ సప్లై చేయనున్నాయి. లాక్‌డౌన్ కారణంగా ఇప్పటికే పలు జిల్లాల్లో కేసుల సంఖ్య తగ్గినట్లు అక్కడి అధికారులు చెప్తున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications