వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ నియామకానికి కేంద్రం ఓకే, త్రివిధ దళాల మధ్య మరింత సమన్వయం

|
Google Oneindia TeluguNews

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో త్రివిద దళాలు మరింత సమిష్టిగా కలిసి పనిచేసేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఫోర్ స్టార్ జనరల్, ఆ స్థాయి కన్నా ఎక్కువ కలిగిన వారిని నియమిస్తారు. సీడీఎస్ నియామకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు తెలిపారు.

మిలిటరీ హెడ్..

మిలిటరీ హెడ్..

చీఫ్ ఆప్ డిఫెన్స్ స్టాప్ మిలిటరీ వ్యవహారాలకు సంబంధించిన అంశాల విభాగ అధిపతిగా వ్యవహారిస్తారు. సీడీఎస్‌కు కార్యదర్శి స్థాయి అధికారాలు ఉంటాయని ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు రక్షణరంగానికి సంబంధించిన ఫైళ్లు రక్షణశాఖ కార్యదర్శి వద్దకు వెళతాయి. అక్కడ ఆమోదం లభిస్తే రక్షణశాఖ మంత్రి వద్దకు చేరుకునేవి. ఇప్పుడు సీడీఎస్ నియామకంతో అన్నీ ఫైళ్లు నేరుగా రక్షణశాఖ మంత్రి వద్దకు చేరుకుంటాయి. దీంతో సమయం ఆదా అవుతుందని, వెంటనే ఆయా అంశాలకు సత్వర పరిష్కారం లభించే అవకాశం ఉందని జవదేకర్ పేర్కొన్నారు.

కలిసికట్టుగా..

కలిసికట్టుగా..

సీడీఎస్ నియామకంతో భారత సైన్యం, భారత నౌకాదళం, భారత వాయుసేన మరింత సమిష్టిగా పనిచేసే అవకాశం లభిస్తోంది. ఆయా అంశాలపై వెంటనే చర్చించి, పరిష్కరించే వీలుంటుంది. ఇప్పటివరకు ఏ చిన్న అంశమైనా కేంద్ర రక్షణశాఖ మంత్రి అనుమతి తీసుకునేందుకు సమయం పట్టేంది. సీడీఎస్ నియామకంతో సత్వరమే సమస్యలు పరిష్కారం అవుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఇక్కడే నాంది..

ఇక్కడే నాంది..

1999 కార్గిల్ యుద్ధం తర్వాత సీడీఎస్ నియామకం జరగాలనే చర్చ జరిగింది. దీని కోసం రివ్యూ కమిటీ నియమించారు. రక్షణశాఖ దళాల మధ్య పరిస్థితిపై అధ్యయనం చేసి.. పలు సూచనలు చేసింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటే మిలిటరీ వ్యవహారాలకు సంబంధించి సలహాదారు అని కూడా కమిటీ పేర్కొన్నది.

అనుభవానికే పెద్దపీట

అనుభవానికే పెద్దపీట

సీడీఎస్‌గా నియమించే వ్యక్తి నాలుగు, నాలుగున్నర స్టార్ ఉన్న అధికారిని పరిగణలోకి తీసుకుంటారు. మూడు సర్వీస్‌లకు చీఫ్‌గా ఉన్నవారినిఎంపికచేసేందుకు పరిశీలిస్తారు. గత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని మోడీ మిలిటరీ వ్యవహారాల కోసం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియమిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో... సీడీఎస్ నియామకానికి ఆమోదం తెలిపింది.

English summary
government has approved the creation of the post of Chief of Defence Staff.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X