Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

China virus: కర్ణాటక హైఅలర్ట్: కీలక నిర్ణయం

రెండు సంవత్సరాల పాటు ప్రపంచ దేశాలను వణికించిన కరోనా వైరస్ మహమ్మారికి పుట్టినిల్లుగా భావిస్తోన్న చైనాలో కొత్త వైరస్ ప్రబలింది. శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దీని బారిన పడి చిన్నపిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నారు. వారిలో శ్వాసకోస సంబంధిత ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

ఆ వైరస్ ఏంటో ఇప్పటివరకు తేల్చలేకపోయింది చైనా. న్యుమోనియాగా నిర్ధారించింది.. తాత్కాలికంగా. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం దీన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఈ న్యుమోనియా తరహా ఇబ్బందులు ఇతర దేశాలకు వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలనీ హెచ్చరించింది.

China Pneumonia Outbreak Karnataka govt issued health advisory

ఈ పరిణామాల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. హెల్త్ అడ్వైజరీని జారీ చేసింది. చలి తీవ్రత పెరుగుతోండటం, ఉష్ణోగ్రత కనిష్ఠ స్థాయికి పడిపోతోండటంతో సీజనల్ వ్యాధులు మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని సూచించింది. ఎలాంటి అనారోగ్యకర సమస్యలు తలెత్తినా సొంత వైద్యానికి బదులుగా డాక్టర్లను సంప్రదించాలని పేర్కొంది.

ఈ మేరకు కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ..ఓ ప్రకటన విడుదల చేసింది. చైనాలో చిన్నపిల్లల్లో శ్వాసకోస సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయంటూ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేసింది. దీనికి- ఇన్‌ప్లుయెంజా, మైకో ప్లాస్మా న్యుమోనియా ఒక కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిందని, సార్స్- సీఓవీ- 2 (SARS-Cov-2)గా ప్రాథమికంగా నిర్ధారించిందని వివరించింది.

చిన్నపిల్లలు, నవజాతా శిశువులు, వృద్ధులు, గర్భిణీలు, రోగనిరోధక శక్తి లేనివారు, దీర్ఘకాలంగా వైద్య చికిత్సలను తీసుకుంటోన్న వారు ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని కర్ణాటక ప్రభుత్వం సూచించింది. ఎలాంటి అనారోగ్యం కలిగినా డాక్టర్లను సంప్రదించాలని, ఆసుపత్రుల్లో అడ్మిట్ కావాలని కోరింది.

జ్వరం, చలి, ఆకలి లేకపోవడం, మైయాల్జియా, వికారం, తుమ్ములు, పొడి దగ్గు తగ్గకపోవడం, అకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడం న్యుమోనియా సాధారణ లక్షణాలు అని, వీటితో బాధపడుతున్న వారు వెంటనే డాక్టర్లను లేదా సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం/ఆసుపత్రులను సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+