వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ, టీ వారిని కాపాడిన చైనీస్, వెయ్యిమంది లెక్క దొరకట్లేదని ఈయూ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన ఇరవై మంది పర్వతారోహకులు ఎవరెస్ట్ పైన చిక్కుకుపోగా, వారిని చైనా మౌంటేనీరింగ్ అసోసియేషన్ (సీఎంఏ) తీసుకువస్తోంది. వారు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ పైన చిక్కుకుపోయారు. నేపాల్ భూకంపం నేపథ్యంలో వారు అక్కడ చిక్కుకుపోయారు. వారిని

నల్గొండ జిల్లాకు చెందిన శేఖర్ బాబు నేతృత్వంలో పలువురు పర్వతారోహణకు వెళ్లారు. భూకంపం కారణంగా చైనా - నేపాల్ హైవే బ్లాక్ అయింది. దీంతో వారు అక్కడే చిక్కుకుపోయారు. వారిని సీఎంఏ రక్షించింది. మేమంతా క్షేమంగా ఉన్నామని, లాసాకు శుక్రవారం సాయంత్రానికి చేరుకుంటామని ఒకరు చెప్పారు. అక్కడి నుండి భారత్‌కు పంపిస్తారు.

Nepal Earthquake

సీఎంఏ వైస్ చైర్మన్ నీమా సెరింగ్ బేస్ క్యాంప్ వద్దకు వెళ్లి తీసుకు వస్తామని చెప్పారని తెలుస్తోంది. ఇది శేఖర్ బాబు, వారి బృందానికి రిలీఫ్.

కాగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌లకు చెందిన ఇరవై మంది పర్వతారోహకులు భూకంపం వల్ల ఐదు రోజులుగా ఎవరెస్టుపై చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వారు ఇప్పటి వరకు ఎవరెస్టుపై సముద్ర మట్టానికి 17,598 అడుగుల ఎత్తులో ఉన్నారు.

ఉత్తర భాగంలో, చైనా వైపు ఉన్నారు. భారత్‌, చైనా ప్రభుత్వాలు తమకు సహకరించి తమను సురక్షితంగా ఇళ్లకు చేర్చాలని ఆ బృందానికి సారథ్యం వహిస్తున్న శేఖర్‌ ఆంగ్ల పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఫోన్ చేశాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. తెలుగువారు చిక్కుకున్నారన్న వార్తతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు వారిని సురక్షితంగా ఇక్కడికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టింది. హైదరాబాదు నుంచి ఏప్రిల్‌ 16న ఈ పర్వతారోహకుల బృందం ఎవరెస్టు అధిరోహించడానికి బయలుదేరింది.

వెయ్యిమంది కనిపించడం లేదన్న ఈయూ అంబాసిడర్

నేపాల్ భూకంపం నేపథ్యంలో తమ దేశానికి చెందిన వెయ్యిమంది ఆచూకీ దొరకడం లేదని ఈయూ అంబాసిడర్ శుక్రవారం ఆందోళన వ్యక్తం చేశారు. అందులో చాలామంది ట్రెక్కింగ్ కోసం వెళ్లారని చెప్పారు. ఈ విషయాన్ని ఈయూ అంబాసిడర్ ఖాట్మాండులో విలేకరులతో చెప్పారు.

English summary
Over 20 mountaineers from Andhra Pradesh and Telangana were on their way home via Lhasa after Chinese Mountaineering Association (CMA) on Thursday rescued them from Everest base camp, where they had been stranded following the Nepal earthquake.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X