• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వారికి భాంగ్రా నాట్యం...వీరికి తైచీ విద్య: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న భారత్ చైనా జవాన్ల వీడియో

|

దేశానికి దేశ రక్షణకు సైనికులు కవచం లాంటి వారు. వారు మన దేశాన్ని 24 గంటలు రక్షణ కవచంలా ఉండకుంటే మనం హాయిగా కునుకు తీయడం కూడా కష్టమే. తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ శతృవుల నుంచి దేశాన్ని కాపాడుతూ అండగా ఉంటారు. ఏ వైపు నుంచి దేశంపైకి శతృవులు దాడి చేస్తారోనని నిత్యం డేగ కళ్లతో పహారా కాస్తూ ఉంటారు. సరిహద్దుల్లో ఎముకలు కొరికే చలికి, ఎండకు, వానకు ఇలా ఒక్క సీజన్ కాదు 365 రోజులు దేశ సంరక్షణే వారి ప్రథమ కర్తవ్యంగా భావిస్తారు. నిన్న మొన్నటి వరకు చైనాతో డొక్లాం వివాదంలో తలమునకలైన సైనికులు కాసేపు అదే సైన్యంతో మన జవాన్లు ఆడిపాడారు.

చైనా జవాన్లకు భాంగ్రా పాఠాలు

భారత్‌ చైనాల మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయో మనకందరికీ తెలిసిందే. ఇక శత్రువులా స్నేహితులా అనే సంగతి కాసేపు పక్కన బెడితే... ఇండో చైనా బోర్డర్‌లో ఇరుదేశాలకు చెందిన సైనికులు మాత్రం ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. మన దేశానికి చెందిన జవాన్లు చైనా సైనికులకు పంజాబీ నృత్యం భాంగ్డా డ్యాన్స్ నేర్పించారు. అంతా ఒక్కటై ఆ ఆనంద సమయాన్ని గడిపారు. శతృవులు అని మరిచి వారితో ఆడిపాడారు. చైనా సైనికులు బాంగ్డా స్టెప్పులు వేస్తుంటే చూడముచ్చటగా ఉన్నింది. ముందే పంజాబీ సాంగ్... మాస్ బీట్.. ఇక ఎవరైనా సరే ఆ పాటలకు కాలుకదపాల్సిందే.. ఇదే జరిగింది చైనా సరిహద్దులో. చైనా జవాన్లు మన భాంగ్రా స్టెప్పులతో అదరగొట్టారు. ఇది జరిగి కొన్ని రోజులు అయ్యింది.

భారత జవానుకు 24 ఫామ్ తైచీ నేర్పిన చైనా సైనికుడు

తాజాగా మరో వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. చైనా జవాన్లకు మన భాంగ్రా స్టెప్పులు భారత జవాన్లు చూపిస్తే... తాము కూడా మేమేమీ తక్కువ కాదంటూ చైనాలో ప్రసిద్ధి గాంచిన 24 ఫామ్ తైచీ నేర్పించాడు. చైనా సైనికుడు చేసి చూపిస్తుండగా మన భారత జవాను అతన్ని ఫాలో అయిపోయాడంతే. ఇంకేం తైచీ వచ్చేసింది. ఈ వీడియోను చైనా ప్రధాన వార్తా పత్రిక పీపుల్స్ డైలీ ట్విటర్‌లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

వీడియోపై ఇవీ నెటిజెన్ల కామెంట్లు

వీడియోపై ఇవీ నెటిజెన్ల కామెంట్లు

చైనా జవాను తైచీ నేర్పిస్తున్న వీడియో వైరల్ అవడంతో నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. చైనా భారత్‌లు రెండు అతిపెద్ద మిత్ర దేశాలు. ఇద్దరి మధ్య స్నేహం కుదరడం అద్భుతం. ఇద్దరు సహకరించుకుంటే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు అని ఒకరు ట్వీట్ చేశారు. మరికొందరు చైనా భారత్‌ల మధ్య శాంతి నెలకొనాలని తామంతా భావిస్తున్నామని... అయితే అమెరికా మాత్రం భారత్ చైనాల మధ్య యుద్ధం నెలకొనాలని కోరుకుంటోందని ... ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలని మరో వ్యక్తి సూచించాడు. ఇంకొందరు చైనాకు యోగాను నేర్పిద్దాం వారిదగ్గర నుంచి తైచీ నేర్చుకుందామంటూ ట్వీట్ చేశారు.

English summary
Soldiers are the pillars of a nation, without them, we cannot breath safe air, as safeguarding the nation is not a piece of cake. The team requires to work hard all shifts and put their hours and hours to protect us.Well, the bond between India and China is something clearly known to both the nation, apart from that still there are moments that compel us to forget the bitterness against each other. The video is going viral on the web where a Chinese soldier teaching 24-form Taichi to some Indian Army Soldier. Take a look at the video.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X