వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దలై లామాపై నిఘా పెట్టిన చైనా మహిళ అరెస్ట్: భద్రత కట్టుదిట్టం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టిబెటన్ ఆధ్యాత్మిక బౌద్ధ గురువు దలైలామాపై గూఢచర్యం చేస్తున్నట్లు అనుమానిస్తున్న చైనా మహిళను బీహార్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. దలైలామా పర్యటన సందర్భంగా బీహార్‌లోని బోద్‌గయాలో గురువారం ఉదయం భద్రతా హెచ్చరిక జారీ చేసిన తర్వాత, చైనా మహిళ కోసం అధికారులు గాలింపు ప్రారంభించారు.

సాంగ్ జియోలం అనే చైనా మహిళ అరెస్ట్

సాంగ్ జియోలం అనే చైనా మహిళ అరెస్ట్


బీహార్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చైనా గూఢచారిని గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. ఆమెను బోద్ గయా పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు.

ఏడీజీ (ప్రధాన కార్యాలయం) జేఎస్ గంగ్వార్ మాట్లాడుతూ.. "టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామాకు బెదిరింపులకు సంబంధించి అనుమానిత (చైనీస్) మహిళను పోలీసులు బోధ్ గయాలో అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విచారిస్తున్నారు.' అని తెలిపారు.
బీహార్ పోలీసులు విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. దలైలామా ఆధ్యాత్మిక బోధనలు చేసే కల్చక్ర గ్రౌండ్ సమీపంలో సాంగ్ జియోలం అనే చైనా మహిళను అరెస్టు చేశారు. అంతకుముందు, బుధవారం సాయంత్రం, గయా పోలీసులు మహిళ స్కెచ్‌తో పాటు ఆమె పాస్‌పోర్ట్, వీసా సమాచారాన్ని విడుదల చేశారు.ఆమె రెండేళ్ల క్రితమే ఇక్కడికి వచ్చిందని తెలిపారు.

టిబెట్ నుంచి వచ్చి భారతదేశంలోనే దలై లామా

87 ఏళ్ల టిబెటన్ ఆధ్యాత్మిక గురువు డిసెంబరు 22న బోధ్‌గయా చేరుకున్నారు. ఫిబ్రవరి 1 వరకు ఆయన అక్కడే ఉండనున్నారు. టిబెట్‌లో తన అధికారానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటును చైనా హింసాత్మకంగా రద్దు చేయడంతో ఏప్రిల్ 1959లో దలైలామా భారతదేశానికి పారిపోయి వచ్చారు. తన మాతృభూమిగా భారత్ మారిపోయిందని ఇటీవల దలై లామా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో దలైలామాపై చైనా కుట్రలు చేస్తూనే ఉంది. ప్రపంచాన్ని కదిలించే ఆధ్యాత్మిక నాయకుడు దలైలామాను "స్ప్లిటిస్ట్", ఉగ్రవాది అని చైనా పేర్కొంటోంది.

కాలచక్ర కోసం బుద్ధ గయాలో దలై లామా: భద్రత కట్టుదిట్టం


ప్రస్తుతం బుద్ధ గయాలోనే దలైలామా ఉండనున్నారు. ఇది 10-రోజుల పండుగ కాలచక్ర కోసం బుద్ధ బోధనలు, ధ్యానాలను కలిగి ఉంటుంది.

దలైలామా తన పవిత్ర యాత్ర కోసం బస చేసిన గయాలోని టిబెటన్ మొనాస్టరీ కోటగా మార్చబడింది, నివాసి లామాలకు కూడా ప్రవేశానికి వ్యక్తిగత గుర్తింపు కార్డులు మంజూరు చేయబడ్డాయి. దలై లామా పర్యటన నేపథ్యంలో పోలీసు భద్రతను కూడా భారీగా పెంచారు. కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

English summary
Chinese Woman Suspected Of Spying On Dalai Lama Detained By Police in Bodh Gaya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X