మిస్టీరియస్ డెత్: ఉరివేసుకున్న స్థితిలో.. 24 ఏళ్ల యువతి
కేరళకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. అద్దెకు ఉంటున్న వసతి గృహంలో ఉరి వేసుకున్న స్థితిలో ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తోన్నారు. ఆమె మరణానికి గల కారణాలు ఇంకా తెలియరావట్లేదు.
ఆ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పేరు చిన్ను పాపు. కేరళలోని కాసర్‌గోడ్ జిల్లా ఆదూర్ ఆమె స్వస్థలం. అసలు పేరు రేష్మా. వయస్సు 24 సంవత్సరాలు. చిన్ను పాపు అనే పేరు మీద సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 50కి పైగా యూట్యూబ్ ఛానళ్లను నిర్వహిస్తోన్నారామె. అందులో ఉండే క్యారెక్టర్ల పేర్లను తన నిక్ నేమ్ గా పెట్టుకున్నారు. ఆమె మరణం అభిమానుల్లో కలకలం రేపింది. దిగ్భ్రాంతికి గురి చేసింది.

ఈ మధ్యాహ్నం కాసర్‌గోడ్‌లోని చూరి ప్రాంతంలోని ఆమె నివాసంలో ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రాథమికంగా పోలీసులు దీనిని ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ఇతర ప్లాట్‌ఫామ్‌లలో చురుకుగా ఉంటూ రెండు లక్షలకు పైగా ఫాలోవర్లను సంపాదించుకున్నారు. ఆమె అకాల మరణ వార్త అభిమానులను, కాసర్‌గోడ్‌ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సోషల్ మీడియా ప్రపంచమంతా ఈ ఘటనతో షాక్‌కు గురైంది.
పోలీసులు సమాచారం అందుకుని వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక పరిశోధనలు చేపట్టారు. మరణ కారణం అస్పష్టంగా ఉన్నప్పటికీ, ప్రాథమిక నివేదికలో దీనిని ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. ఘటనపై అసాధారణ మరణం కింద కేసు నమోదు చేసి, పోలీసులు సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహానికి ఇన్క్వెస్ట్, పోస్టుమార్టం ప్రక్రియల అనంతరం, బంధువులకు అప్పగిస్తామని అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications