చాకోలెట్ బ్రౌన్ రంగులో కొత్త 10 రూపాయాల నోటు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: కొత్త పది రూపాయాల నోటును ఆర్‌బిఐ ప్రవేశ పెట్టనుంది.చాకోలెట్ బ్రౌన్ రంగులో మహత్మాగాంధీ సిరిస్‌లో ఈ నోటును విడుదల చేయనున్నారు. ఈ కొత్త నోటుపై కోణార్క్ సన్ టెంపుల్ చిత్రం ముద్రించనున్నారని సమాచారం.

సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికే కొత్త నోట్లను 1 బిలియన్ మేరకు ముద్రించినట్టు ఆర్బీఐ అధికారులు చెబుతున్నారు. కొత్త పది రూపాయాల నోటుకు సంబంధించి డిజైన్‌ను కూడ ప్రభుత్వం గత వారంలోనే ఆమోదించిందని తెలిపారు.

Chocolate brown: The colour of the new Rs 10 note to be issued by RBI

గతేడాది ఆగస్టులో మహాత్మాగాంధీ సిరీస్‌లో ఆర్‌బీఐ కొత్త రూ.200, రూ.50 నోట్లను ప్రవేశపెట్టింది. నకిలీ నోట్లకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ కొత్త డిజైన్లలో తక్కువ డినామినేషన్ నోట్లను పున: ప్రవేశపెడుతోంది.

ఈ క్రమంలోనే కొత్త రూ.10 నోట్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నారు.ప్రస్తుతం మారుస్తున్న పాత రూ.10 నోటు డిజైన్ 2015 లో రూపొందించారు. త్వరలోనే ఈ కొత్త నోటు అందుబాటులోకి రానుందని అధికారులు చెబుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
After the big Indian notes, now it's time for 10 rupee note to get a new makeover. According to reports, the Reserve Bank of India is all set to issue new Rs 10 notes under the Mahatma Gandhi series with chocolate brown colour as the base.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి