రిటైర్మెంట్ కు ముందు ఈ సిక్సర్లు ఏంటి ? జడ్జిలపై సీజేఐ విసుర్లు..!
దేశవ్యాప్తంగా ప్రస్తుతం న్యాయమూర్తుల్లో ఓ ట్రెండ్ కనిపిస్తోంది. పలు చోట్ల న్యాయమూర్తులు తమ రిటైర్మెంట్ కు ముందు కీలక తీర్పులు ఇస్తున్నారు, లేదా గతంలో ఇచ్చిన తీర్పుల్ని అసాధారణంగా సవరిస్తున్నారు. అలాగే రిటైర్మెంట్ తర్వాత పదవులు కోరుకుంటున్నారు. ఈ ట్రెండ్ పై సుప్రీంకోర్టు ఇవాళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ పిటిషన్ పై విచారణ సందర్భంగా ఛీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కింది స్థాయి జడ్డీల తీరును తీవ్రంగా ఆక్షేపించింది.
దేశంలో పలు చోట్ల న్యాయమూర్తులు తమ పదవీ విరమణలకు ముందు తీసుకుంటున్న నిర్ణయాలపై భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పదవీ విరమణకు కేవలం 10 రోజుల ముందు తన సస్పెన్షన్‌ను సవాలు చేస్తూ మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక ప్రిన్సిపల్ జిల్లా న్యాయమూర్తి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారిస్తోంది. సదరు న్యాయమూర్తి జారీ చేసిన రెండు న్యాయపరమైన ఆదేశాలతో ఈ సస్పెన్షన్ కూ లింక్ ఉందనే ఆరోపణలు ఉన్నాయి.

దీనిపై దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన ఛీఫ్ జస్టిస్ సూర్యకాంత్.. పదవీ విరమణకు ముందు పిటిషనర్ సిక్స్‌లు కొట్టడం ప్రారంభించారు, ఇది దురదృష్టకర ధోరణి అన్నారు. తాను దాని గురించి మరింత వివరణ ఇవ్వదల్చుకోలేదన్నారు. జిల్లా న్యాయమూర్తి వాస్తవానికి నవంబర్ 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ రెండు న్యాయపరమైన ఆదేశాల కారణంగా నవంబర్ 19న సస్పెండ్ అయ్యారు. ఆయన మొదట నవంబర్ 30న పదవీ విరమణ చేయాల్సి ఉండగా, రాష్ట్రం తన ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచిన తర్వాత ఆయన పదవీ విరమణను ఒక సంవత్సరం పాటు వాయిదా వేయాలని సుప్రీంకోర్టు నవంబర్ 20న మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

దీనిపై ఛీఫ్ జస్టిస్ ఫైర్ అయ్యారు. ఆ రెండు ఉత్తర్వులు జారీ చేసినప్పుడు జడ్డీకి తన పదవీ విరమణ వయస్సును ఒక సంవత్సరం పెంచారని తెలియదని,రిటైర్మెంట్ కు ముందు చాలా ఉత్తర్వులు జారీ చేసే ధోరణి పెరుగుతోందన్నారు. జిల్లా న్యాయమూర్తి తన సస్పెన్షన్‌ను సవాలు చేస్తూ హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని కూడా ధర్మాసనం ప్రశ్నించింది.తప్పుడు ఉత్తర్వులు జారీ చేసినందుకు జడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోలేమని, అయితే సదరు ఆదేశాలు నిజాయితీగా లేకపోతే మాత్రం చర్యలు ఉంటాయని క్లారిటీ ఇచ్చింది.












Click it and Unblock the Notifications