రేప్ యత్నం: తల్లిదండ్రులపై బాలిక ఫిర్యాదు

ఛండీగఢ్: తల్లిదండ్రులు తన చేత బలవంతంగా వ్యభిచారం చేయించాలని చూస్తున్నారంటూ తనను తాను రక్షించుకునేందుకు ఓ తొమ్మిదేళ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని వల్లభ్‌గఢ్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక మొహ్‌నా గ్రావూనికి చెందిన ఓ బాలిక తన తండ్రి యజమాని ప్రేమ్‌సింగ్‌ అనే వ్యక్తి తనపై అత్యాచారం చేయబోయాడని, ఆ విషయం తన తల్లిదండ్రులకు చెప్తే వారు ప్రేమ్‌సింగ్‌ చెప్పినట్లు వినమని బలవంతం చేస్తున్నారని ఆ బాలిక పోలీసులకు తెలిపింది.

ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని తల్లి బెదిరించిందని, ప్రేమ్‌ సింగ్‌ కూడా తనకి రూ.500 ఇచ్చాడని ఫిర్యాదులో పేర్కొంది.

Class IV girl saves herself from being forced by parents to have sex with father's employer

బాలిక తన సోదరుడి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు నిందితులైన బాలిక తల్లిదండ్రులు, ప్రేమ్‌సింగ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

గోడ కూలడంతో అక్కాచెల్లెళ్లు మృతి

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం భారీ వర్షలతో అతలాకుతలమవుతోంది. సద్వాపూర్ గ్రామంలో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో ఓ గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను రోహిణి(7), సుచిత్ర(5)గా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+