వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్ : ఉదయం నుంచి ఒడిదుడుకుల్లో.. చివరికి లాభాల్లో స్టాక్ మార్కెట్లు!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ముంబై: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ సందర్భంగా దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాల్లోకి జంప్‌ చేశాయి. ఉదయం నుంచి ఒడిదుడుకులుగా సాగిన మార్కెట్లు, కొనుగోళ్ల జోరుతో చివరికి మంచి లాభాలతో ముగిశాయి.

సెన్సెక్స్‌ 194 పాయింట్లు జంప్‌ చేసి, 33,247 వద్ద, నిఫ్టీ 59 పాయింట్లు లాభపడి 10,252 వద్ద క్లోజయ్యాయి. గురువారం రెండో దశ గుజరాత్‌ పోలింగ్ అనంతరం ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదల కానున్నాయి.

Closing bell: Sensex gains 194 pts ahead of Gujarat exit polls; Midcap index flat

మదుపర్లు ఈ ఎగ్జిట్‌ పోల్స్‌పై ఎక్కువగా దృష్టిసారించారు. అమెరికా ఫెడ్‌ పావు శాతం వడ్డీ పెంచడంతోపాటు జీడీపీ 2.5 శాతం వృద్ధి చూపనున్నట్లు పేర్కొనడంతో దేశీయ మార్కెట్లు తొలుత లాభాలతో ప్రారంభమయ్యాయి.

ఆపై గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో పలుమార్లు హెచ్చుతగ్గులను చవిచూశాయి. మీడియా మినహా అన్ని రంగాల షేర్లు లాభపడగా.. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, బ్యాంక్‌ నిఫ్టీ 0.7 శాతం స్థాయిలో పుంజుకున్నాయి.

నిఫ్టీ దిగ్గజాలలో హెచ్‌పీసీఎల్‌, సిప్లా, డాక్టర్‌ రెడ్డీస్‌, టెక్‌ మహీంద్రా, ఐవోసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐటీసీ, ఎంఅండ్‌ఎం, బీపీసీఎల్‌, యాక్సిస్‌ 3.3-1.3 శాతం మధ్య పైకి ఎగిశాయి. అయితే టీసీఎస్, యూపీఎల్‌, గెయిల్‌, అరబిందో, సన్‌ ఫార్మా, అల్ట్రాటెక్‌ 2.7-0.5 శాతం మధ్య నీరసించాయి.

English summary
Stock market benchmark Sensex edged higher today on value-buying in blue-chips ahead of exit poll results for Gujarat election. Asian stocks moved sideways. In early noon trade, the Sensex was up 30 points at 33,083 while Nifty hovered near 10,200. The Sensex had lost 402.75 in the previous two sessions disappointed by grim economic data and the ADB lowering India's economic growth forecast. In her final act as the Fed chair, Janet Yellen moved to hike rates to a range of 1.25 per cent to 1.5 per cent, citing solid US job growth and household spending. The central bank kept its policy outlook on additional increases for 2018 and 2019 unchanged. Prominent gainers were Dr Reddy's, ONGC, Wipro, Bharti Airtel, Infosys, Heromoto Corp and Lupin.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X