కేజ్రీవాల్ ఎంట్రీ - కాంగ్రెస్ కు దెబ్బేనా, కీలక మలుపు..!!

ఆప్ అధినేత తాజా నిర్ణయం కాంగ్రెస్ కు ఇబ్బందిగా మారుతోంది. హర్యానాలో కాంగ్రెస్ ఈ సారి గెలుపు ధీమాతో బరిలోకి దిగుతోంది. కాంగ్రెస్ తో పొత్తు చర్చలు కొలిక్కి రాకపోవటంతో ఆప్ ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేయటం ద్వారా బీజేపీ వ్యతిరేక ఓటు చీలుతుందనే ఆందోళన కాంగ్రెస్ లో కనిపిస్తోంది. కేజ్రీవాల్ హర్యానాలో ఒంటరిగా పోటీ చేయటం వెనుక భారీ లక్ష్యంతో ఉన్నట్లు కనిపిస్తోంది.

కేజ్రీవాల్ రాకతో
హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. తొలుత బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ - ఆప్ కలిసి పోటీ చేయాలని భావించాయి. అయితే సీట్ల అంశం కొలిక్కి రాకపోవటంతో వేర్వేరుగానే బరిలోకి దిగుతున్నాయి. కాంగ్రెస్‌ 89 చోట్ల బరిలో దిగింది. ఒక స్థానాన్ని సీపీఎంకు ఇచ్చింది. దీంతో.. ఆప్ 40 స్థానాలకు పోటీ చేస్తోంది. పొరుగు రాష్ట్రాలు ఢిల్లీ, పంజాబ్ లో అధికారంలో ఉన్న ఆప్ కు ఈ సారి హర్యానాలోనూ ప్రభావం చూపిస్తామనే నమ్మకంతో ఉంది. ఇప్పుడు హర్యానా ఎన్నికల పైన కేజ్రీవాల్ పార్టీ ముఖ్యులతో సమావేశం నిర్వహించారు.

CM Arvind Kejriwal is now focused on the upcoming elections in Haryana

బలం చాటుతారా
2019 ఎన్నికల్లో ఆప్ 46 స్థానాల్లో పోటీ చేసింది. నామ మాత్రపు ఓట్లను కూడా దక్కించుకోలకపోయింది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిందని ఆ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ కేసులో జైలుకు వెళ్లిన కేజ్రీవాల్ విడుదల అయ్యారు. ఢిల్లీ సీఎం పదవికి రేపు (మంగళవారం) రాజీనామా చేయనున్నారు. ఢిల్లీలోనూ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక, ఇప్పుడు కేజ్రీవాల్ హర్యానా ఎన్నికల ప్రచారానికి సిద్దమయ్యారు. తన ప్రచారంలో బీజేపీతో పాటుగా కాంగ్రెస్ ను కేజ్రీవాల్ టార్గెట్ చేసే అవకాశం కనిపిస్తోంది.

కాంగ్రెస్ కు నష్టమేనా
కేజ్రీవాల్ గురించి ప్రజల్లో స్పందన ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో కేజ్రీవాల్ ప్రచారం..ఆప్ కారణంగా బీజేపీతో పాటుగాకాంగ్రెస్ పార్టీకి సైతం గట్టి దెబ్బ తప్పదనే అవకాశముందని ఆప్ నేతలు అంచనా వేస్తున్నారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం.. పట్టణ ఓటర్లపై ఎక్కువగా ఉందనే విశ్లేషణలు వస్తున్నాయి. ఢిల్లీ, పంజాబ్ సరిహద్దుల్లోని బీజేపీ వ్యతిరేక ఓట్లను సైతం ఆమ్ ఆద్మీ పార్టీ కొల్లగొట్టే అవకాశముందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో..ఇప్పుడు హర్యానా ఎన్నికల్లో కేజ్రీవాల్..ఆప్ ప్రభావం బీజేపీ కంటే కాంగ్రెస్ కు టెన్షన్ పెంచుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+