మహాలో సీఎం ఛైర్ స్టోరి రిపీట్..!!

Maharashtra Asssembly election results 2024: మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ పాగా వేసింది. కనీవినీ ఎరుగని అత్యంత భారీ మెజారిటీని సాధించింది. శివసేన (ఏక్‌నాథ్ షిండే)- బీజేపీ- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్) సారథ్యంలోని మహాయుటి కూటమి విజయదుందుభి మోగించింది. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.

మొత్తం 288 నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 145. దీన్ని అలవోకగా అందుకుంది మహాయుటి. ఈ కూటమి అభ్యర్థులు 230 నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించారు. ఓ అధికార కూటమి ఇంత భారీ మెజారిటీతో గెలుపొందడం ఇదే తొలిసారి.

CM Eknath Shinde is likely to proposed a 50 50 power sharing formula

ఇది- బీజేపీకి రుచి చూసిన చారిత్రాత్మక విజయం అనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. బీజేపీతో పాటు ఏక్‌నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా పోరాడాయి. శివసేన ఉద్ధవ్ థాకరే, ఎన్సీపీ, కాంగ్రెస్ మహా వికాస్ అఘాడీని మట్టి కరిపించాయి. ఈ తిరుగులేని విజయాన్ని అందుకున్నాయి.

బీజేపీ 149 సీట్లల్లో పోటీ చేసి132 చోట్ల విజయం సాధించింది. షిండే వర్గం శివసేన 81 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టగా 57 మంది గెలుపొందారు. అజిత్ వర్గానికి చెందిన ఎన్సీపీ మొత్తం 59 స్థానాల్లో పోటీ చేయగా 41 సీట్లు ఈ పార్టీ ఖాతాలో పడ్డాయి. లోక్‌సభ ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ మూడు పార్టీల ఓటుబ్యాంకు అమాంతం పెరిగింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే- మూడు పార్టీలు కలిసివుంటనే మహాయుటి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది. అధికారాన్ని అందుకోగలుగుతుంది. ఏ ఒక్క పార్టీకి కూడా సొంతంగా ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ దక్కకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ మూడు పార్టీలు ఖచ్చితంగా పరస్పరం సహకరించుకోగలిగితేనే మహాయుటి ప్రభుత్వం ఏర్పడగలగుతుంది. ఈ పరిణామాలను షిండే వర్గ శివసేన నాయకులు తమకు అనుకూలంగా మలచుకుంటోన్నట్లు తెలుస్తోంది. 50:50 పవర్ షేరింగ్ ఫార్ములాను తెర మీదికి తీసుకొచ్చినట్లు టైమ్స్ నౌ ఓ కథనాన్ని ప్రసారం చేసింది.

తొలి రెండున్నరేళ్లు ఏక్‌నాథ్ షిండే, మలి రెండున్నరేళ్లు దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా వ్యవహరించేలా ప్రతిపాదించాలని శివసేన నిర్ణయించినట్లు చెబుతున్నారు. దీనిపై కొత్తగా ఎమ్మెల్యేలతో నిర్వహించబోయే సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారని, ఓ తీర్మానాన్ని ఆమోదిస్తారని అంటున్నారు.

కొత్త ప్రభుత్వంలో కూడా షిండే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా తొలి రెండున్నరేళ్ల పాటు కొనసాగించాలని, మలి రెండున్నరేళ్ల కాలంలో దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా, షిండే, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా వ్యవహరించేలా పవర్ షేరింగ్ ఫార్ములాను అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా ఊపందుకుంటోంది.

2019 నాటి ఎన్నికల్లోనూ ఉద్దవ్ థాకరే సారథ్యంలోని శివసేన ఇదే ఫార్ములాను బీజేపీకి ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీనికి అంగీకరించకపోవడంతో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు ఉద్ధవ్. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి మహా వికాస్ అఘాడీ ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా అదే రిపీట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+