అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం.. కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్
భారత రాజ్యాంగం మార్చాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ చేసిన కామెంట్లు అగ్గిరాజేశాయి. విపక్షాలు ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. సీఎం కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ విరుచుకుపడ్డారు. ఢిల్లీ తెలంగాణ భవన్ లో నిరసన వ్యక్తం చేశారు. తర్వాత అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసననగా తెలంగాణ భవన్‌లో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకరం చేశారు. రాజ్యాంగం గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. సీఎం కేసీఆర్ కామెంట్స్ బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగొద్దనేలా ఉన్నాయని విమర్శించారు.

కేసీఆర్ వ్యాఖ్యలతో బడుగు బలహీనవర్గాలపై కేసీఆర్కు ఉన్న ద్వేషం బయటపడిందని అన్నారు. సీఎం కేసీఆర్ అంబేద్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు హాజరుకారని బండి సంజయ్ ఆరోపించారు. 125 అడుగుల బాబా సాహెబ్ విగ్రహాన్ని నిర్మిస్తామని చెప్పిన కేసీఆర్.. ఆ హామీ ఏమైపోయాయని అడిగారు. విగ్రహాన్ని ఎందుకు నిర్మించలేదు అని ప్రశ్నించారు.
రాజ్యాంగం తిరిగి రాయాలనే వ్యక్తి తెలంగాణ సీఎంగా ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. ఆయనపై దేశ ద్రోహం కేసు పెట్టాలని అన్నారు. కేసీఆర్ అంత అవినీతిపరుడు ఎవరూ ఉండరని విమర్శలు సంధించారు. కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నాయకులు గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేయనున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు. తదుపరి కార్యాచరణను గురువారం ప్రకటిస్తామని చెప్పారు.
అంతకుముందు బండి సంజయ్ మాట్లాడారు. తెలంగాణలో రైతులు కోటీశ్వర్లు అయితే ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారో చెప్పాలన్నారు. కేంద్రానికి ధాన్యం కొనే ఆలోచన లేకుండా ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఎందుకు కేటాయిస్తుందని కేసీఆర్‌ని అడిగారు. 317 జీవో పేరుతో ఉద్యోగులను కేసీఆర్ అవమానిస్తున్నారని బండి సంజయ్ అన్నారు. 317 జీవో మంచిదైతే 10 మంది ఉద్యోగులు ఎందుకు సూసైడ్ చేసుకుంటారని నిలదీశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని కేసీఆర్ అనడం పచ్చి అబద్దం అన్నారు. కొత్త ఉద్యోగాలిస్తానని ఎన్నికల సమయంలో ఊరిస్తున్నారు తప్ప నోటిఫికేషన్లు ఏవి? అని అడిగారు.












Click it and Unblock the Notifications