దళిత కార్యకర్తకు సీఎం క్షమాపణలు!.. ఆ ఇద్దరిని తొలగించేశారు
పార్టీ దళిత కార్యకర్త బంత్ సింగ్ పై దాడి చేసిన నేతలను పార్టీలో చేర్చుకున్నందుకు గాను ఆప్ అధినేత కేజ్రీవాల్ ఆయనకు క్షమాపణలు తెలియజేశారు.
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ లోని ఆ పార్టీ దళిత కార్యకర్త, గాయకుడు బంత్ సింగ్ జబ్బార్ కు క్షమాపణలు చెప్పారు. బంత్ సింగ్ ఓ సభలో పాల్గొన్న సమయంలో ఆయనపై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులను పార్టీలో చేర్చుకోవడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
విషయాన్ని గుర్తించిన కేజ్రీవాల్ తక్షణం వారిద్దరని పార్టీ నుంచి తొలగించారు. అనంతరం మంగళవారం నాడు బంత్ సింగ్ ను ప్రత్యక్షంగా కలుసుకుని ఆయన్ను సమూదాయించే ప్రయత్నం చేశారు. పొరపాటు జరిగినందుకు ఆయనకు క్షమాపణలు తెలియజేశారు.

దీనిపై స్పందించిన ఆప్ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్.. 'జరిగిన పొరపాటును నిజాయితీగా ఒప్పుకుంటున్నారం.. దానికి మేం సిగ్గపడుతున్నాం.. ఆ ఇద్దరు నిందితుల్ని పార్టీ నుంచి తొలగించాం' అని తెలిపారు.
కాగా, మూడు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం నాడు కేజ్రీవాల్ పంజాబ్ వచ్చారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. బుధవారం నాడు లంబీ నియోజవర్గంలో ప్రచార సభ నిర్వహించబోతున్నారు. ప్రస్తుత పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గం నుంచి ఢిల్లీ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ ను బరిలోకి దింపాలని ఆప్ భావిస్తోంది.జర్నైల్ సింగ్ పోటిని బుధవారం నాడు కేజ్రీవాల్ ధ్రువీకరించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications