మోదీకి సరైనోడు వచ్చేశాడు - కేసీఆర్‌కు జంక్షన్ జామ్

లక్నో: దేశంలో 2024 నాటి సార్వత్రిక ఎన్నికల కోసం ప్రతిపక్షాలు సమాయాత్తమౌతోన్నాయి. కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రను చేపట్టింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ ఈ యాత్రను కొనసాగిస్తోన్నారు. ఈ ఉదయం కేరళలోని అళప్పుజలో ఆయన 11వ రోజు పాదయాత్రను చేపట్టారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా 3,500 కిలోమీటర్ల పాటు ఆయన కాలినడకన పర్యటించనున్నారు. 150 రోజుల పాటు 12 రాష్ట్రాల గుండా భారత్ జోడో యాత్ర కొనసాగేలా రూట్ మ్యాప్ సిద్ధం చేసింది కాంగ్రెస్.

మోదీకి ధీటు..

మోదీకి ధీటు..

మరోవంక- కాంగ్రెసేతర పార్టీలన్నీ కలిసి ఎన్డీఏ కూటమిని ఎదుర్కొనడానికి రంగం సిద్ధం చేసుకుంటోన్నాయి. తమ ఉమ్మడి ప్రధాన మంత్రి అభ్యర్థి కోసం అన్వేషిస్తోన్నాయి. పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, తెలంగాణ ముఖ్యమంత్రులు మమత బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, కే చంద్రశేఖర్ రావుతో పాటు బిహార్ సీఎం నితీష్ కుమార్‌లల్లో ఒకరిని ప్రధాని అభ్యర్థిగా రంగంలోకి దించే అవకాశాలు ఉన్నాయి. ఈ నలుగురిలో ఎవరి పేరు తెర మీదికి వస్తుందనేది విషయంపై కొంతకాలంగా చర్చ సాగుతోంది.

నితీష్ వైపే..

నితీష్ వైపే..

మెజారిటీ ప్రతిపక్ష పార్టీలు తమ ఉమ్మడి ప్రధాన మంత్రి అభ్యర్థిగా బిహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీష్ కుమార్‌ పేరును బలపరుస్తారనే వార్తలు వెలువడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీకి ధీటైన ఆయన ఒక్కరేననే అభిప్రాయం ప్రతిపక్ష పార్టీల్లో ఉంది. మోదీ తరహాలోనే దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్ కావడం కలిసొచ్చే అంశంగా భావిస్తోన్నాయి. ఎన్డీఏ నుంచి బయటికి రావడంతో ప్రతిపక్షాల చూపులన్నీ ఆయన మీదే నిలిచాయి.

ఎన్డీఏ లోపాలు..

ఎన్డీఏ లోపాలు..

మొన్నటివరకు ఎన్డీఏ భాగస్వామిగా కొనసాగిన నితీష్ కుమార్‌కు అక్కడి గుట్టుమట్లన్నీ తెలుసని- ఎన్డీఏకు ధీటుగా రాజకీయ వ్యూహాలను రూపొందించగలరని ప్రతిపక్ష పార్టీల నాయకులు చెబుతున్నారు. ప్రధాని అభ్యర్థిత్వంపై ఇప్పటివరకు నితీష్ కుమార్ పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. రాష్ట్రీయ జనతాదళ్‌ సహకారంతో బిహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలోనూ ఆయన దీనిపై వ్యాఖ్యానించడానికి ఇష్టపడలేదు. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన బిహార్ పర్యటనలోనూ ఆయన దీనికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు.

ఆసక్తి లేదంటూ..

ఆసక్తి లేదంటూ..

ప్రధాని అభ్యర్థిత్వంపై తనకు ఏ మాత్రం ఆసక్తి లేదని, తాను పోటీదారుడిని ఎంతమాత్రం కాదని నితీష్ కుమార్ తేల్చి చెప్పారు. ప్రధాని కావాలనే కోరిక కూడా లేదని స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆయన సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి సహా పలు జాతీయ పార్టీల నేతలతో సమావేశం అయ్యారు. బిహార్‌లో అధికారంలో ఉన్న మహాకూటమి సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నందున వారిని కలిశానంటూ అప్పట్లో నితీష్ కుమార్ చెప్పుకొచ్చారు.

యూపీ నుంచి పోటీ..

యూపీ నుంచి పోటీ..

ఇప్పుడు మళ్లీ నితీష్ కుమార్ పేరు తెర మీదికి వచ్చింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడానికి ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటోన్నారనే ప్రచారం ఊపందుకుంది. ఉత్తర ప్రదేశ్ నుంచి పోటీ చేయాల్సిందిగా ప్రతిపక్ష నేత, సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్.. ఆహ్వానించారని, దీనిపై నితీష్ కుమార్ తన తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉందంటూ జాతీయ మీడియా స్పష్టం చేసింది.

సీటు కూడా రెడీ..

సీటు కూడా రెడీ..

ఉత్తర ప్రదేశ్‌లోని ఫూల్‌పూర్‌ నుంచి నితీష్ కుమార్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. దీనితోపాటు- అంబేద్కర్ నగర్, మిర్జాపూర్ స్థానాలు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మిర్జాపూర్ స్థానానికి ప్రస్తుతం బీజేపీ మిత్రపక్ష పార్టీకి చెందిన అనుప్రియ పటేల్ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. 2019 ఎన్నికల్లో అంబేద్కర్ నగర్ స్థానం నుంచి బీఎస్పీ అభ్యర్థి రితేష్ పాండే విజయం సాధించారు. ఫూల్‌పూర్‌పై బీజేపీ జెండా ఎగురుతోంది. కేసరీ దేవి పటేల్ ఇక్కడ గెలుపొందారు.

యూపీ నుంచే ఎందుకు..?

యూపీ నుంచే ఎందుకు..?

ఉత్తర ప్రదేశ్ నుంచే నితీష్ కుమార్ పోటీ చేయడానికి కారణాలు లేకపోలేదు. యూపీ మొత్తం బీజేపీకి కంచుకోట. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత కొంతమేర బలహీనపడిందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన కేబినెట్ మంత్రి సైతం రాజీనామా చేశారు. దీన్ని ఇంకా బలహీనపర్చాలంటే నితీష్ కుమార్ వంటి నాయకుడు యూపీ నుంచే పోటీ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.

సీట్ల సంఖ్య తగ్గితేనే..

సీట్ల సంఖ్య తగ్గితేనే..

అక్కడ బీజేపీ సీట్లను గణనీయంగా తగ్గించగలిగితే- కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదనే అంచనాలు ఉన్నాయి. ఇదంతా వాస్తవరూపాన్ని దాల్చాలంటే నితీష్ కుమార్ పోటీ చేయడానికి అంగీకరించాల్సి ఉంటుంది. లోక్‌సభలో తమ సీఎం పోటీ చేసే అవకాశాలు లేకపోలేదంటూ జేడీయూ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ సైతం స్పష్టం చేశారు. ఈ పరిణామాలు కేసీఆర్‌ను సంకటస్థితిలో నెట్టొచ్చు. ఆయన కూడా జాతీయ రాజకీయాల్లో ప్రవేశించడానికి రంగం సిద్ధం చేసుకుంటోన్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+