MH Elections: కూటమి నేతలకు అసలు పరీక్ష..!!
మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్య నేతలు తమ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మరో రోజులో నామినేషన్ల ఘట్టం ముగియనుంది. రెండు కూటముల నుంచి ఇంకా అభ్యర్ధులను ఖరారు చేయాల్సి ఉంది. ముఖ్యమంత్రి షిండే తన నామినేషన్ దాఖలు చేసారు. అభ్యర్ధుల ఖరారు ఈ రాత్రి లోగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. అయితే,సీట్లు దక్కని వారు రెబల్స్ గా బరిలోకి దిగే అవకాశం ఉండటం ఇప్పుడు రెండు కూటమి ల్లోనూ ముఖ్య నేతల సమర్తకు పరీక్షగా మారుతోంది.
రేపు లాస్ట్ డే
మహారాష్ట్ర ఎన్నికల్లో రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. సీఎం షిండే, ఉప ముఖ్యమంత్రి పఢ్నవీస్ సహా రెండు కూటముల నుంచి ముఖ్య నేతలు పలువురు ఈ రోజు నామినేషన్లు దాఖలు చేసారు. మంగళవారం తో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. రెండు కూటము ల నుంచి ఇంకా పలు నియోజకవర్గాలకు అభ్యర్ధులను ఖరారు చేయాల్సి ఉంది. ఈ సారి మహారాష్ట్ర ఎన్నికలు బీజేపీ - కాంగ్రెస్ కూటములకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. రెండు కూటము ల్లోనూ కీలక నేతల స్థానాలను ఇప్పటికే దాదాపు ఖరారు చేసారు. అయితే, పార్టీల కూటమిగా ఉండటంతో సీట్ల కోసం పోటీ ఎక్కువగా ఉంది. ఇదే ఇప్పుడు సమస్యగా మారుతోంది.

పవార్ పైనే బాధ్యత
మహారాష్ట్రలో ఆప్ ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయటం లేదు. మహా వికాస్ అఘాడీకి మద్దతు ఇస్తోంది. మహావికాస్ అఘాడిలో కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్ బాల్ థాక్రే వర్గం), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ - NCP (శరద్ పవార్ వర్గం) ప్రధాన భాగస్వాములుగా ఉన్నాయి. అదే సమయంలో బలమైన ప్రాంతీలుగా ఉన్న శివసేన, ఎన్సీపీలు కూటమిలో కాంగ్రెస్ పార్టీకి పెద్దన్న పాత్ర ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. ఇక, సీట్ల సంఖ్య విషయంలోనూ మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. ప్రాంతాల వారిగా కాంగ్రెస్ బలంగా ఉన్న విదర్భంలో శివసేన 16-17 సీట్లను చివరి నిమిషం వరకు ఒత్తిడి చేస్తోంది.
తుది కసరత్తు
కూటమిలో సీఎం అభ్యర్థిత్వం పైన అంతర్గతంగా చర్చ సాగుతోంది. కూటమిని శరద్ పవార్ సమన్వయం చేసే బాధ్యత తీసుకున్నారు. పెండింగ్ స్థానాల ఖరారు పైన ఫోకస్ చేసారు. అటు మహాయుతి కూటమిలో బీజేపీ అత్యధికంగా 121 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. శివసేన షిండే వర్గం నుంచి 45 మంది అభ్యర్థులు, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం నుంచి 49 మంది అభ్యర్థులను ప్రకటించారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ సమీపించిన నేపథ్యంలో రెండు కూటములు మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి తుది జాబితాను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications