దర్శన్ కొంపముంచిన వైరల్ ఫొటో..షిఫ్ట్ ?!

Challenging Star Darshan: ప్రముఖ కన్నడ నటుడు, శాండిల్‌వుడ్ సూపర్ స్టార్ దర్శన్ తూగుదీప కష్టాలు మరింత పెరిగాయి. హత్యకేసులో అరెస్టయిన ఆయన జైలులో రాజభోగాలను అనుభవిస్తోన్నారంటూ వచ్చిన ఆరోపణలు, తాజాగా వెలుగులోకి వచ్చిన ఫొటో, వీడియో కాల్ ఆయన కొంపముంచింది.

చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌ను ప్రధాన నిందితుడు. కన్నడ నటి పవిత్ర గౌడపై సోషల్ మీడియాలో అసభ్యకర, అశ్లీలకరమైన పోస్టులు, కామెంట్స్ చేస్తుండేవాడనే కారణంతో రేణుకా స్వామిపై కక్ష పెంచుకుని సుపారీ ఇచ్చి అతణ్ని హత్య చేయించాడనే ఆరోపణలపై దర్శన్ అరెస్ట్ అయ్యారు. బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటూ విచారణను ఎదుర్కొంటోన్నారు.

CM Siddaramaiah instructed to immediately transfer Darshan and others to different jails

జైలులో దర్శన్ రాజభోగాలను అనుభవిస్తోన్నారని, ఓ రిసార్టులో ఉన్నట్లుగా అన్నింటినీ సమకూర్చుకున్నాడనే విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆదివారం సాయంత్రం సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఓ ఫొటో.. ఈ అనుమానాలకు మరింత బలాన్ని కలిగించింది.

ఓ చేతిలో కాఫీ కప్, మరో చేతిలో సిగరెట్‌తో కనిపించాడు దర్శన్ ఈ ఫొటోలో. అతనితో పాటు మరో ముగ్గురు పిచ్చాపాటి మాట్లాడుకుంటూ బేఫికర్‌గా ఉన్నట్లు తేలింది. తనకోసం ప్రత్యేకంగా ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్నాడనే విమర్శలు చెలరేగాయి. అదే సమయంలో మార్కెట్ ధర్మ అనే ఓ రౌడీ షీటర్ కొడుకుతో వీడియో కాల్‌లో మాట్లాడటం కూడా కలకలం రేపింది.

ఈ పరిణామాలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారు. సమగ్ర విచారణకు జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్‌కు ఆదేశించారు. దర్శన్ సహా అతనితో పాటు ఉన్న వారందరినీ కూడా వెంటనే వేర్వేరు జైళ్లకు తరలించాలని ఆదేశించారు.

దీనితో పాటు విలాస జీవితాన్ని అనుభవించేలా దర్శన్‌కు అన్నీ సమకూర్చి పెట్టిన ఏడుమంది పరప్పన అగ్రహార జైలు సిబ్బందిపైనా బదిలీ వేటు పడింది. శరణ బసవ అమీన్‌గఢ్, ప్రభు ఎస్ ఖండేల్వాల్, అసిస్టెంట్ జైలర్లు ఎల్ ఎస్ తిప్పేస్వామి, శ్రీకాంత్ తల్వార్, హెడ్ వార్డెన్లు వెంకప్ప కోర్టీ, సంపత్ కుమార్ కడపల్లి, వార్డర్ బసప్ప తేలిని బదిలీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+