బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కళ్లు దానం చేసేందుకు సీఎం, ఆయన ఆశీస్సుతో..: చిరంజీవి

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్ కుమార్ స్మారకాన్ని బెంగళూరులోని కంఠీరవ స్టూడియో ఆవరణలో శనివారం కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లాంఛనంగా ఆవిష్కరించారు. రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

స్మారక ఆవిష్కరణ సందర్భంగా రాజ్ కుమార్ ఆశయమైన నేత్రదానం పిలుపుకు లక్షమంది ముందుకు రావడం అభినందనీయమని సిద్ధరామయ్య అన్నారు. కాగా, సిద్ధరామయ్య కూడా తన కళ్లను దానం చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఆయన కళ్లను దానం చేసే పత్రాన్ని నింపారు.

నైతిక విలువలు కలిగిన నటుడు రాజ్ కుమార్ అని రజనీకాంత్ కొనియాడారు. రాజ్ కుమార్ ఆశీస్సులతో ప్రముఖ నటుడిగా ఎదిగినట్లు చిరంజీవి చెప్పారు. కన్నడిగుడిగా ఆయన ఆశయాలు చారిత్రాత్మకమని కేంద్రమంత్రి సదానంద గౌడ అన్నారు.

సిద్ధరామయ్య

సిద్ధరామయ్య

కర్నాటక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సిద్ధరామయ్య శనివారం తన కళ్లను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. కిషన్ చంద్ చెల్లారామ్ ఐ బ్యాంక్‌కు ఆయన డొనేట్ చేస్తూ పత్రం పైన సంతకం చేశారు.

సిద్ధరామయ్య

సిద్ధరామయ్య

కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్ కుమార్ స్మారకాన్ని బెంగళూరులోని కంఠీరవ స్టూడియో ఆవరణలో శనివారం కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లాంఛనంగా ఆవిష్కరించారు.

చిరు, రజనీకాంత్

చిరు, రజనీకాంత్

ఈ స్మారక ఏర్పాటు కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

రాజ్ కుమార్

రాజ్ కుమార్

కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్ కుమార్ స్మారకాన్ని బెంగళూరులోని కంఠీరవ స్టూడియో ఆవరణలో శనివారం కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లాంఛనంగా ఆవిష్కరించారు.

English summary
Karnataka Chief minister Siddaramaiah on Saturday morning filled a form to donate his eyes in Dr.Rajkumar memorial inauguration program, Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X