బల పరీక్షలో నెగ్గిన విజయ్, 144 ఎమ్మెల్యేల మద్దతు- AIADMK గల్లంతు..!!

తమిళనాడు అసెంబ్లీలో విజయ్ తన బలం నిరూపించుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు వేళ 118 మంది సభ్యుల మద్దతు వేళ ఊహించని రాజకీయం చోటు చేసుకుంది. అయిదు పార్టీలు.. 120 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విజయ్.. ఈ రోజు అసెంబ్లీలో బల పరీక్ష ఎదుర్కొన్నారు. ఏకంగా 144 మంది ఎమ్మెల్యేల మద్దతు పొందారు. డీఎంకే వాకౌట్ చేయగా.. అన్నా డీఎంకే చీలిక వర్గం మద్దతుగా నిలిచింది. దీంతో.. కొత్త రాజకీయం మొదలైంది.

బల పరీక్షలో తమిళనాడు సీఎం గెలుపొందారు. అసెంబ్లీలో జరిగిన ఓటింగ్ లో 144 మంది విజయ్ కు మద్దతు తెలిపారు. 22 మంది వ్యతిరేకంగా ఓటు వేసారు. బలపరీక్ష సమయంలో డీఎంకే వాకౌట్ చేసింది. 61 మంది ఎమ్మెల్యేలు వాకౌట్ చేసిన వారుగా తేల్చారు. బల పరీక్ష వేళ మాజీ సీఎం పళిని స్వామి నేరుగా విజయ్ ను టార్గెట్ చేసారు. దీనికి విజయ్ సైతం గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. సభ సాక్షిగా అన్నా డీఎంకే చీలిక వర్గం విజయ్ కు మద్దతు ప్రకటించింది.

కారు డ్రైవర్ కుమారుడికి విజయ్ ప్రభుత్వంలో కీలక పదవి..!!
కారు డ్రైవర్ కుమారుడికి విజయ్ ప్రభుత్వంలో కీలక పదవి..!!
cm-vijay-won-the-trust-motion-with-144-votes-in-its-favour-and-22-votes-against-it-five-mlas-abstai

కాగా, బల పరీక్ష చర్చ వేళ ప్రతిపక్ష నేత ఉదయ నిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేసారు. సీఎం విజయ్ కు పూర్తి ప్రజామోదం లేదని వ్యాఖ్యానించారు. డీఎంకే పక్షాలే విజయ్ కు మద్దతుగా నిలిచాయని గుర్తించాలని సూచించారు.కాగా, తనకు మద్దతు ఇచ్చిన వారికి విజయ్ కృతజ్ఞతలు చెప్పారు. తమది సెక్యులర్ ప్రభుత్వంగా పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఐదేళ్ల పాటు కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేసారు. అదే విధంగా గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కొనసాగిస్తామని వెల్లడించారు. తమను వ్యతిరేకించిన వారి కోసం కూడా ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేసారు. తమ ప్రభుత్వం హార్స్ ట్రేడింగ్ చేయలేదని.. హార్స్ స్పీడ్‌లో మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. అందరికి సామాజిక న్యాయం మా ధ్యేయంగా ప్రకటించారు. ఇక.. సీఎం విజయ్‌పై ఉదయనిధి స్టాలిన్ విమర్శలు చేసారు. టీవీకే పార్టీకి మెజారిటీ రాలేదని వ్యాఖ్యానించారు. ప్రజామోదం పొందడంలో విజయ్ పార్టీ విఫలమైందని విమర్శించారు. టీవీకేకు బయట నుంచి మాత్రమే మద్దతు ఉందని చెప్పారు. 65 శాతం ప్రజలు విజయ్‌ని తిరస్కరించారని వ్యాఖ్యానించారు.

మోదీ కేబినెట్ లోకి జనసేన, ఆయనకే ఛాన్స్- రామ్మోహన్ శాఖ మార్పు, ముహూర్తం ఫిక్స్..!!
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఆయనకే ఛాన్స్- రామ్మోహన్ శాఖ మార్పు, ముహూర్తం ఫిక్స్..!!

అవినీతి పార్టీలతో విజయ్ పార్టీ కలిసిపోయిందని విమర్శించారు. ఇప్పటికే ప్రజల నమ్మకాన్ని విజయ్ కోల్పోయారని చెప్పారు. టీవీకేకు ఓటేసిన ప్రజలు బాధపడుతున్నారని వివరించారు. తమ ఎమ్మెల్యేలను సీఎం విజయ్ కలవడం సరికాదని మాజీ సీఎం పళనిస్వామి వ్యాఖ్యానించారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఆఫర్ చేశారని చెప్పుకొచ్చారు. దీని ద్వారా విజయ్ పూర్తి స్థాయిలో మెజార్టీ ప్రభుత్వం గా కొనసాగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+