మోదీ చెప్పారు.. యోగి చేశారు: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం వేళ..

Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ గడువు సమీపించింది. ఈ నెల 22వ తేదీన ఈ ఆలయాన్ని ప్రారంభించాల్సి ఉంది. సోమవారం నుంచే పండగలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 4,000 వేలమంది ప్రముఖులు హాజరు కానున్నారు.

ఇప్పటికే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్.. ఆహ్వానపత్రికలను అందించింది. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ నటీనటులు, సెలెబ్రిటీలకు ఆహ్వానం అందింది. అయోధ్యలో ప్రతి ఇంటికీ రామాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలను పంపించింది.

CM Yogi Adityanath participate in Swachhta Abhiyaan at Ayodhya Ram Mandir

రామమందిరం ప్రారంభోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని మోదీ.. సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలనూ పరిశుభ్రంగా ఉంచేలా స్వచ్ఛ అభియాన్‌ను శుక్రవారం ప్రారంభించారు. నాసిక్‌లోని ప్రాచీన కాలా రామ్ ఆలయం ప్రాంగణం మొత్తాన్నీ శుభ్రపరిచారు. తడిబట్టతో నేలను తుడిచారు.

అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం జరిగే జనవరి 22వ తేదీ వరకూ ప్రతి రోజూ ఆలయాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచాలంటూ మోదీ పిలుపునిచ్చారు. ఈ పిలుపునకు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు స్పందించారు. ఈ ఉదయం నుంచీ తమ రాష్ట్రాల పరిధిలో ఉన్న ఆలయాల్లో స్వచ్ఛ అభియాన్‌ చేపట్టారు.

ఇందులో భాగంగా- ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఉదయం అయోధ్య ఆలయంలో క్లీనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. చీపురు పట్టి ఆలయాన్ని శుభ్రం చేశారు. ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, అయోధ్య జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు స్వచ్ఛ అభియాన్‌లో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+