సీఎం విజయ్ కు అతిపెద్ద ఛాలెంజ్.. ముందు నుయ్యి వెనక గొయ్యి లాంటి పరిస్థితి..?

తమిళనాడు సీఎంగా విజయ్ దూసుకెళ్తున్నారు. సంచలనాత్మక నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. తమ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా ముందుకెళ్తున్నారు. అటు సినిమాల్లో తన నటనతో కోట్లాదిమంది ఫ్యాన్స్ ను ఏర్పరచుకున్న విజయ్.. సీఎం అయ్యాక అదే రేంజ్ లో కీలక నిర్ణయాలు తీసుకుంటూ తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు. అయితే సీఎం విజయ్ కు తొలిసారిగా బిగ్ సవాల్ ఎదురైనట్లు తెలుస్తోంది. తమిళనాడులోని హోసూర్ లో టాటా ప్లాంట్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప్లాంట్ లో యాపిల్ ఐఫోన్ ల కోసం విడిభాగాలను తయారు చేస్తుంటారు. అయితే ఈ ఫ్యాక్టరీ విడుదల చేసే రసాయన వ్యర్థజలాలు తమ పంట పొలాలు, బావులను కలుషితం చేస్తున్నాయని అక్కడి రైతులు ఇప్పటికే చాలా సార్లు తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి (టీఎన్‌‌పీసీబీ)కి ఫీర్యాదులు చేశారు.

అయితే పర్యావరణం కలుషితం దృష్ట్యా తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి రైతుల ఆవేదనను అర్థం చేసుకుని ఇదే విషయంపై అధికారులు చాలాసార్లు క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఫ్యాక్టరీ నుంచి రసాయన కలుషిత వ్యర్థాలు పంట పొలాలకు వస్తున్నట్లు గుర్తించారు. ఈ వ్యర్థాల కారణంగా భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని తేల్చింది. ఈ మేరకు ఈ విషయంపై సరైన వివరణ ఇవ్వాలని టాటా ఎలక్ట్రానిక్స్ హోసూర్ ఫ్యాక్టరీకి ఆదేశాలు జారీ చేసింది. లేదంటే ఫ్యాక్టరీని మూసేస్తామని, విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు గత నెల 25న మూడు పేజీలతో కూడిన షోకాజ్ నోటీసు జారీ చేసింది.

CMVijay Faces Major Crisis Tata Electronics Hosur Factory Shutdown Looms Large CMVijay Tata plant

మరోవైపు టాటా ఫ్యాక్టరీ వాదన మాత్రం మరోలా ఉంది. తాము ఒక గుర్తింపు పొందిన ల్యాబ్ ద్వారా పరీక్షలు నిర్వహించామని.. తమ సంస్థ అన్ని రకాల పర్యావరణ నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తోందని పేర్కొంది. అటు అధికారులు, ప్రభుత్వం సైతం వెంటనే ఈ ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్యాక్టరీలోని వేల మంది ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. అంతేకాక ఐఫోన్ లకు విడిభాగాలు తయారు చేసే ఈ ఫ్యాక్టరీ చాలా కీలకం. తైవాన్ లోని ఫాక్స్ కాన్ సంస్థ తర్వాత దక్షిణాసియాలో ఆపిల్ సంస్థకు విడిభాగాలు అందించే రెండో అతిపెద్ద సప్లయర్ ఇదే. ఈ క్రమంలో సీఎం హోదాలో విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆందోళన అందరిలోనూ ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+